కెసిఆర్ పాలసీ: చీప్ లిక్కర్‌పై మాట్లాడతానన్న కూతురు కవిత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చీప్ లిక్కర్ విషయమై ఆమె స్పందించారు.

ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన తర్వాత తాను చీప్ లిక్కర్ పైన మాట్లాడుతానని చెప్పారు. తమ సంస్థ జాగృతి గుడుంబా పైన పోరాటం చేస్తామని చెప్పారు. గుడుంబా వల్ల ఎక్కువ మంది మహిళలే నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబాను నియంత్రించేందుకే చీప్ లిక్కర్ అన్నారు.

కాగా, ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకటించాక తాను స్పందిస్తానని కవిత చెప్పడం గమనార్హం. పాలసీ నచ్చకుంటే ఆమె ఏం చేస్తారు? అయితే, ప్రభుత్వం పాలసీని ఆమె సమర్థించే అవకాశాలు కొట్టిపారేయలేమని చాలామంది భావిస్తున్నారు.

Kavitha to respond on government liquor policy

దళితులకు 3,600 ఎకరాలు కొనిచ్చాం: రామ్ లక్ష్మణ్

దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల కోసం మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ సలహాదారు రామ్ లక్ష్మణ్ మంగళవారం అన్నారు. దళితులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 3,600 ఎకరాల భూమిని కొనిచ్చిందన్నారు.

దేశంలో ఎక్కడా కూడా దళితుల కోసం భూమిని కొని పంచడంలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఎకానమిక్ సపోర్ట్ స్కీంలో ఎస్సీ, ఎస్టీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, సంవత్సర కాలంలో దళితుల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+