వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందు అది చెప్పండి: పవన్ కళ్యాణ్, మాయావతి పొత్తుపై గట్టి కౌంటర్ ఇచ్చిన కవిత

|
Google Oneindia TeluguNews

Recommended Video

జనసేన,బీఎస్పీ పొత్తుపై గట్టి కౌంటర్ ఇచ్చిన కవిత ! | Oneindia Telugu

హైదరాబాద్: మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల పొత్తుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది కేవలం పొలిటికల్ స్టంట్ అన్నారు. అసలు ఏపీలో వారు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారా, లేక ఒంటరిగా వెళ్తున్నారా చెప్పాలన్నారు. దీనిపై మొదట స్పష్టత కావాలన్నారు.

దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. ప్రాంతీయ పార్టీలు ముద్దు అనుకుంటున్నాయని, తెరాస పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యమన్నారు. అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. తమ పార్టీకి జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు తెలంగాణ అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. ఆమె మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు.

<strong>పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం, హఠాత్తుగా లక్నోలో మాయావతితో భేటీ: ఏపీ-తెలంగాణలలో బీఎస్పీతో పొత్తు</strong>పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం, హఠాత్తుగా లక్నోలో మాయావతితో భేటీ: ఏపీ-తెలంగాణలలో బీఎస్పీతో పొత్తు

 విభజన హామీలపై పోరాటం చేశాం

విభజన హామీలపై పోరాటం చేశాం

బీజేపీ విభజన హామీలపై తాము పోరాటం చేశామని కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు తక్కువగా ఉంటే ఆ సంఖ్య పెంచమని కేంద్రం చుట్టూ తాము తిరిగామని కవిత అన్నారు. హక్కు భుక్తంగా రావాల్సిన ఎయిమ్స్‌ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నామన్నారు. నిజామాబాద్ రైల్వే లైన్‌కు నిధులు సాధించామన్నారు. దానిని పూర్తి చేశామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దిందేనని, ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటిన్నారు. ఆ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మందిరం, మసీద్, బోఫోర్స్, రాఫెల్ అంశాలను తెరపైకి తీసుకు వచ్చాయన్నారు.

ఇద్దరు ఎంపీలతో దేవేగౌడ ప్రధాని అయ్యారు, కేసీఆర్ దేశానికి అవసరం

ఇద్దరు ఎంపీలతో దేవేగౌడ ప్రధాని అయ్యారు, కేసీఆర్ దేశానికి అవసరం

తమను ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని కవిత చెప్పారు. ఇప్పుడు 16 టీఆర్ఎస్ 1 మజ్లిస్ ఎంపీలను గెలిపిస్తే సైనికుల్లా పనిచేస్తామన్నారు. గతంలో ఇద్దరు జేడీఎస్ ఎంపీలు గెలిస్తే, ఒకరు ప్రధాని (దేవేగౌడ) అయ్యారని, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించామని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశముందన్నారు. మన కేసిఆర్ లీడర్ అని, దేశాన్ని సరైన మార్గంలో నడిపించడమే కాక మంచి మార్గంలో నడుపుతాడన్నారు. సీఎం కేసిఆర్‌కు విజన్, దార్శనికత ఉందని, అది దేశానికే దిశానిర్దేశం కావాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టిందే దేశ ప్రజల కోసమని, కాంగ్రెస్ వాళ్లు తమ పార్టీని బిజెపికి బి-టీమ్ అంటున్నారని, బిజెపి వాళ్ళు కాంగ్రెస్‌కు బి టీమ్ అంటున్నారని, కానీ తాము తెలంగాణ ప్రజలకు బి టీమ్ అన్నారు.

 నానమ్మ ఒకటి చెబితే రాహుల్ మరొకటి చెబుతున్నారు

నానమ్మ ఒకటి చెబితే రాహుల్ మరొకటి చెబుతున్నారు

షి టీమ్స్, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శమని కవిత అన్నారు. ఏడెనిమిది రాష్ట్రాలు రైతు బందు అమలు చేస్తున్నాయని, కిసాన్ సమ్మాన్‌ను ఎన్నికల ముందు ప్రకటించడం రైతులను మోసం చేయడమే అన్నారు. రైతు బంధు అమలుకు ముందే మనం భూ రికార్డుల ప్రక్షాళన చేశామన్నారు. బిజెపి రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో భూముల వివరాలు సరిగా లేవని, రాహుల్ గాంధీ పేదలకు నెలకింత అని ఇస్తానని చెబుతున్నారని, నానమ్మ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తే, ఆయన దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారన్నారు. నానమ్మ గరీభి హటావో నినాదం ఇచ్చారని, రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సైనికుల్లా ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
19 న నిజామాబాద్ లో జరిగే సీఎం బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం సభ నిర్వహిస్తున్నామని, అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

English summary
K Kavitha,TRS on BSP&Jana Sena alliance in Andhra Pradesh&Telangana: It's just a political stunt. Main issue will be if they're going to fight polls independently or they'll contest polls with Chandrababu Naidu in Andhra Pradesh. They'll have to give clarity on this to the people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X