ట్రైలర్ మాత్రమే చూశారు, త్రీడి స్క్రీన్‌‌పై అసలు సినిమా చూపిస్తాం: కవిత వ్యాఖ్యలు

Recommended Video

    Telangana Elections 2018 : ట్రైలర్ మాత్రమే చూశారు.. అసలు సినిమా చూపిస్తాం

    జగిత్యాల: అవినీతీకి పుట్టిన కవలలే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మండిపడ్డారు. ఆమె జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు ట్రయలర్ మాత్రమే చూశారన్నారు.

    త్రీడి స్క్రీన్ పైన అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇదే ఆఖరి పోటీ అని చెప్పిన జీవన్ రెడ్డి ఈసారి ఎలా పోటీ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

    2006, 2008లలో కేసీఆర్ పైన పోటీ చేసేందుకు జీవన్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్, టీడీపీకి సెంటిమెంట్ లేవన్నారు. మహాకూటమికి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.

    Kavitha says TRS will show 3d screen film in future

    యాదాద్రి ప్లాంటునుకోమటిరెడ్డి వెంకట రెడ్డి అడ్డుకుంటున్నారని హరీష్ రావు వేరుగా అన్నారు. కళ్యాణ లక్ష్మీని రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటోందని చెప్పారు. అయితే వద్దు లేకపోతే రద్దు.. ఇదీ కాంగ్రెస్ పాలసీ అన్నారు. తెలంగాణలో అధికారం మారబోతుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. మొదట రాజస్థాన్‌లో బీజేపీ ఎలా గెలుస్తుందో చూసుకోవాలన్నారు. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది బీజేపీయే అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+