బీఆర్ఎస్ వాళ్లు నా దారికి రావాల్సిందే, ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ - కవిత సంచలనం..!!
ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్ల అంశంలో స్పందన పైన కవిత రియాక్ట్ అయ్యారు. అదే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పైన తన అభి ప్రాయం స్పష్టం చేసారు. తాజాగా ఎమ్మెల్సీతో వివాదం పైన ఘాటుగా స్పందించారు. బనకచర్ల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన కవిత తన అభిప్రాయం స్పష్టం చేసారు. బీఆర్ఎస్ పార్టీ పైన కవిత చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
ఆర్డినెన్స్ కరెక్టే
ఎమ్మెల్సీ కవిత మరో సారి బీఆర్ఎస్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని తన అభిప్రాయం స్పష్టం చేసారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని.. అది సరి కాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందేనని కవిత చెప్పుకొచ్చారు. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ విశ్లేషించారు. 2018 చట్ట సవరణ చేసి.. ఆర్డినెన్స్ తేవడం సబబేనని అభిప్రాయపడ్డారు.
తాను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానని వెల్లడించారు.

నా దారికి రావాల్సిందే
తన పై మల్లన్న చేసిన కామెంట్స్‌కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని కవిత చెప్పుకొచ్చారు. వారు స్పందించకపోవటాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. నిన్నటి డిల్లీ సమావే శంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారని విమర్శించారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ హక్కులను కాల రాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏమి లాభం లేదని కవిత పేర్కొన్నారు.
పోరాటం చేస్తాం
కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకు వెళ్లాలని కవిత డిమాండ్ చేసారు. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారని.. ముఖ్యమంత్రి ఇంకా కాలేజ్ లోనే ఉన్నట్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేసారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబు కు గిఫ్టుగా ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసానని.. ఆయన ఎవరో తనకు తెలియదని కవిత చెప్పుకొచ్చారు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు వారికి బొగ్గుగని కార్మిక సంఘం భాద్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications