"తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి"

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి.. నిరుద్యోగులతో మాట్లాడారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు. అనేక వాగ్దానాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని కవిత మండిపడ్డారు.

వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దాని ప్రకారం నియామకాలు జరపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. మొన్నటి గ్రూప్-1 లో అనేక తప్పులు చేశారని.. తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థులకు అన్యాయం చేశారని తెలిపారు. అలా కాకుండా క్వాలిటీ ఎగ్జామ్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో మిడ్ డే మీల్స్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

" నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు. అనేక వాగ్దానాలు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. దాని ప్రకారం నియామకాలు జరపాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు నిరుద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాం. మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామకాలనే చేపడుతున్నారు" అని కవిత మండిపడ్డారు.

"ఇవ్వాళ ఆదిలాబాద్ లో లైబ్రరీ కి వచ్చి చూస్తే చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. డీఎస్సీ, ఫార్మసీ, గ్రూప్స్ కోసం వారంతా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ అనిశ్చితి ఉందని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో..ఇప్పుడు అదే అనిశ్చితిని కొనసాగిస్తున్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సీరియస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి" అని కవిత డిమాండ్ చేశారు.

Kavitha s Adilabad Alert Demand for Instant Job Calendar Echoes from Library Halls

"మొన్నటి గ్రూప్-1 లో అనేక తప్పులు చేశారు. తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థులకు అన్యాయం చేశారు. అలా కాకుండా క్వాలిటీ ఎగ్జామ్స్ నిర్వహించండి. ప్రతిపక్షాలు, మేము అందరం మీకు సహకరిస్తాం. విద్యార్థులకు మేలు చేయండి. ఇక్కడ లైబర్రీలో కనీస వసతులు లేవు. మండలాల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి ఇక్కడే మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేస్తే వారికి మేలు చేసినట్లు అవుతుంది. గతంలో మేము నిజామాబాద్ లైబ్రరీలో జాగృతి తరఫున విద్యార్థులకు లంచ్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో మిడ్ డే మీల్స్ పెట్టాలి. లైబ్రరీలో కరెంట్ పోతే గంటలు గంటలు పోతోంది. కనీసం జనరేటర్ అయిన ఏర్పాటు చేయాలి" అని కవిత డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి, యువకులను నమ్మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+