సింగరేణి కార్మికులకు శుభవార్త: సింగరేణి లాభాల్లో 27 శాతం బోనస్
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సింగరేణి లాభాల్లో కార్మికులకు 27 శాతం బోనస్ ఇవ్వనున్నారు. బుధవారం నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
బోనస్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు 27 శాతం బోనస్ ఇవ్వనున్నారు. గత ఏడాది కంటే ఇది రెండు శాతం అదనం.

ఈ మేరకు ఎంపీ కవిత ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆమె సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందించారు. సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు 27 శాతం ప్రాఫిట్ ఇచ్చేందుకు కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఇందుకు ఆయనకు థ్యాంక్స్ అని చెప్పారు. జై సింగరణే, జై తెలంగాణ అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications