పండగ: కేసీఆర్‌కు స్వీట్ తినిపించిన మహిళ(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఉద్యోగులకు పండుగ తీసుకు వచ్చారు. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటంచారు.

రాష్ట్ర ఆవిర్భావ తేదీ నుండి దీనిని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎనిమిది నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

మార్చి నుండి జీతంలో పెరుగుదల ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ప్రకటనతో తెలంగాణ ఉద్యోగులు ఆనందిస్తున్నారు. కేసీఆర్‌ను అభినందిస్తున్నారు.

 పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు తొలి వేతన సవరణను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ప్రకటించారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

10వ వేతన సవరణ సిఫారసును 43 శాతం ఫిట్‌మెంట్‌తో ఖరారు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ వల్ల ఏటా ప్రభుత్వంపై 6,500 కోట్ల రూపాయల భారం పడనుందని వివరించారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి తదితరుల సమక్షంలో ముఖ్యమంత్రి కొత్త పీఆర్సీని ప్రకటించారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

ప్రకటించిన పీఆర్సీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, 2014 నుంచి అమలులోకి వస్తుందని, ఇది జూన్ 30వ తేదీన రిటైరైన ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

సవరించిన కొత్త వేతనాన్ని ఉద్యోగులు వచ్చే నెల మార్చి నుంచి అందుకుంటారని, బకాయిలను వారి జిపిఎఫ్ ఖాతాలో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

ఎమ్మెల్సీల స్థానాలు భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ తమ శాసనసభ కార్యదర్శి రాజా సదారాంను కోరడంతో, ఏ క్షణాన అయినా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో జాప్యానికి ఆస్కారం లేకుండా వెంటనే పీఆర్సీని ప్రకటించాల్సి వచ్చిందని కేసీఆర్ వివరించారు.

 పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు పలు దఫాలుగా చర్చించి ఫిట్‌మెంట్‌పై అంగీకారానికి వచ్చినప్పటికీ, ఇంకా కొన్నింటిపై ఏకాభిప్రాయం కుదరలేదన్నారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

వీటిపై అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని, అలాగే ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సరళీకృతం చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాల్సిందిగా ఆదేశించారు. వేతన సవరణకు సంబంధించిన ఉత్తర్వులను శుభదినం శుక్రవారం జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చారిత్రాత్మకమైందని, ఉద్యమ సందర్భంగా వారు ఎసిబి కేసులు, పోలీసు కేసులు, సస్పెన్షన్లవంటి అనేక వేధింపులకు గురైనా వెనుకాడలేదని కేసీఆర్ కొనియాడారు.

పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

ఉద్యోగుల సంఘాల నేతలతో అధికారులు అనేక దఫాలు చర్చించాకే వారిని సంతృప్తిపర్చేలా ఫిట్‌మెంట్‌ను ప్రకటించామని, వారు కూడా కష్టపడి, ఎక్కువ సమయం పని చేసి ప్రభుత్వ ఆదాయం పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 పీఆర్సీ పండుగ

పీఆర్సీ పండుగ

ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం పట్ల సచివాలయంలో ఉద్యోగుల సంబరాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే వేతన సవరణను కేసీఆఱ్ ప్రకటించడంతో జై తెలంగాణ నినాదాలతో వారు హర్షం ప్రకటించి, మిఠాయిలు పంచారు. బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+