కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకా నా పెళ్లినాటి వసతులే: రాజన్న సేవలో కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్య క్షేత్రానికి మహర్ధశ పట్టబోతోంది. దేవస్థాన అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. అతి త్వరలోనే పలు అభివృద్ధి పనులు చేపట్టి రెండు మూడేళ్లల్లో అనూహ్యరీతిలో అభివృద్ది చేస్తామని సిఎం ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా గురువారం వేములవాడ ఆలయాన్ని సందర్శించారు కెసిఆర్. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని సిఎం కెసిఆర్ గురువారం సతీసమేతంగా దర్శించుకున్నారు. కరీంనగర్ నుంచి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం 12.30నిమిషాలకు సిఎం వేములవాడ చేరుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్ పట్టుబట్టలతో కుటుంబ సమేతంగా దేవాలయానికి చేరుకున్నారు. సతీమణి శోభతో పాటు కూతురు కవిత, అల్లుడు అనిల్‌తో కలిసి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలో గణపతి పూజలు నిర్వహించి రాజరాజేశ్వరస్వామికి అన్నపూజతో పాటు అభిషేకాలు నిర్వహించారు.

మేళతాళాల మధ్య దేవాలయ ప్రధాన మొక్కైన కోడె మొక్కులను సీఎం కుటుంబసభ్యులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ తరువాత ఓడిబియ్యం పోసి ప్రత్యేకపూజలు చేశారు.

అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. రెండుగంటలపాటు ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంగణ పరిధిలోని దర్గాలో ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. 47 ఏళ్ళ క్రితం ఇదే ఆలయంలో జరిగిన తన పెళ్ళినాటి వసతులే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఆలయ ప్రాంగణ విస్తరణతోపాటు, అన్ని విధాల బాగుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా 100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో భారీ భవంతులు నెలకొల్పడం ఆలయ విశిష్టతకు కొంతమేర ఇబ్బంది కలుగుతున్నట్లుగా భావిస్తున్నామన్నారు. 1000 నుంచి 1200 మీటర్ల ఎత్తు భవవాలకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోనే మేటిగా అభివృద్ధి చేసుకునేందుకు దేవాలయ పురోగతికి స్థానికులు సహకరించాలన్నారు. ఆలయ విస్తరణ కోసం పక్కనున్న 20 నుంచి 30 ఎకరాల భూమిని ఎంత ఖర్చైనా భరించి సేకరించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆలయానికి టెంపుల్ అథారిటీ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు.

కేబినెట్‌లో చర్చించి కమిటీ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు. గుడి చెరువులో స్వామి వారి తెప్పోత్సవంతో పాటు బోటుషికారు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్టు ప్రకటించారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

దక్షిణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్య క్షేత్రానికి మహర్ధశ పట్టబోతోంది.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

దేవస్థాన అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

అతి త్వరలోనే పలు అభివృద్ధి పనులు చేపట్టి రెండు మూడేళ్లల్లో అనూహ్యరీతిలో అభివృద్ది చేస్తామని సిఎం ప్రకటించారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా గురువారం వేములవాడ ఆలయాన్ని సందర్శించారు కెసిఆర్.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని సిఎం కెసిఆర్ గురువారం సతీసమేతంగా దర్శించుకున్నారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

కరీంనగర్ నుంచి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం 12.30నిమిషాలకు సిఎం వేములవాడ చేరుకున్నారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్ పట్టుబట్టలతో కుటుంబ సమేతంగా దేవాలయానికి చేరుకున్నారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

సతీమణి శోభతో పాటు కూతురు కవిత, అల్లుడు అనిల్‌తో కలిసి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలో గణపతి పూజలు నిర్వహించి రాజరాజేశ్వరస్వామికి అన్నపూజతో పాటు అభిషేకాలు నిర్వహించారు.

రాజన్న సేవలో కెసిఆర్

రాజన్న సేవలో కెసిఆర్

మేళతాళాల మధ్య దేవాలయ ప్రధాన మొక్కైన కోడె మొక్కులను సీఎం కు టుంబసభ్యులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ తరువాత ఓడిబియ్యం పోసి ప్రత్యేకపూజలు చేశారు.

శృంగేరీపీఠం ఆధ్వర్యంలో సంస్కృత, వేద పాఠశాలలు నిర్మించబోతున్నామని, సిరిసిల్ల వేములవాడ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించేందుకు ఆదేశాలు జారీచేస్తున్నట్టు తెలిపారు.

ఆలయానికి మరో 2 బ్రిడ్జిలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఆలయ పరిధిలోని అనుబంధ ఆలయాలనూ అభివృద్ధి చేయబోతున్నట్టు చెప్పారు. నాంపల్లి గుట్టపైన కాటేజీలను ఏర్పాటు చేయడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao has announced several sops for the development of the ancient and historic Sri Raja Rajeshwara Swamy Devasthanam here, which is also called ‘Dakshin Kashi’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X