మునుగోడులో కేసీఆర్ మరో మాస్టర్ ప్లాన్.. ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా వారికి వ్యక్తిగతంగా లేఖలు!!

మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కొత్త మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మునుగోడు ఓటర్ల మద్దతు కోసం తాజాగా మరో మాస్టర్ ప్లాన్ వేశారు.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్

ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఛార్జిషీట్ వేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, కెసిఆర్ ఆ ప్రయత్నానికి చెక్ పెట్టేలా మునుగోడులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన లబ్దిదారులందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం సుమారు 3.95 లక్షల మంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక వీరందరికీ సీఎం కెసిఆర్ రాసిన లేఖలను పంపాలని నిర్ణయించినట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

లబ్దిదారులకు సీఎం కేసీఆర్ వ్యక్తిగత లేఖలు

లబ్దిదారులకు సీఎం కేసీఆర్ వ్యక్తిగత లేఖలు

మునుగోడులో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలను చెప్పి, మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని లేఖలో కోరనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ లు, రైతు బంధు పథకం, రైతు భీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, పంట రుణాల మాఫీ, గొర్రెల పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్, గర్భిణీలకు కేసీఆర్ కిట్లు తదితర పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులకు కెసిఆర్ వ్యక్తిగతంగా లేఖలు రాయడం చేస్తే, కొంత మంది ఓటర్లు అయినా టిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని, ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపిస్తారని టిఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

గులాబీ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని కేసీఆర్ లేఖ

గులాబీ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని కేసీఆర్ లేఖ


తెలంగాణ రాష్ట్ర విభజన అయిన 2014 నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3,34, 994 మంది వివిధ సంక్షేమ పథకాల ద్వారా 10, 260 కోట్ల రూపాయల మేర లబ్ది పొందినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా లేఖలు రాసి వీరందరికీ ప్రభుత్వం వారి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తుందని చెప్పదలుచుకున్నారని తెలుస్తుంది. అయితే సీఎం కేసీఆర్ లేఖలలో లబ్దిదారుని పేరు తో పాటు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను కూడా పొందుపరిచి, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, కెసిఆర్ వారికి హామీ ఇవ్వనున్నట్లు గా సమాచారం.

 కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక.. అందుకే కొత్త వ్యూహం

కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక.. అందుకే కొత్త వ్యూహం

వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా మార్చుకోవడం కోసం గులాబీ బాస్ రంగంలో దిగుతారని, ఈ క్రమంలోనే వ్యక్తిగత లేఖలు రాస్తారని తెలుస్తుంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న క్రమంలో ఇప్పటికే దూకుడు పెంచిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటుంది. గులాబీ పార్టీ నేతలందరూ మునుగోడు లోనే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ మునుగోడు ఓటర్లకు లేఖలు రాయాలని నిర్ణయం కూడా మునుగోడు ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థమయ్యేలా చెబుతుంది. మరి మునుగోడు లబ్ధిదారుల మనసు గెలుచుకోవడం కోసం కెసిఆర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+