అన్నీ హుజూరాబాద్ కేనా?: కేసీఆర్ మరో ఎత్తుగడ -బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాంబరం కృష్ణమోహన్

''సంక్షేమ పథకాలు, పదవులు పంచి ప్రజల్ని ఆకట్టుకోవడం రాజకీయ పార్టీగా మేం చేయాల్సిందే, టీఆర్ఎస్ ఏమీ సన్నాసుల మఠం కాదుగా..'' అంటూ ఎన్నికల వేళ తాయిలాల ప్రకటను బాజాప్త సమర్థించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అదే పని చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్గాత్మకంగా తీసుకున్న గులాబీ బీస్ ఇప్పటికే ఆ ఊరికి చెందిన పలువురు నేతలకు కీలక పదవులు కట్టబెట్టగా తాజాగా..

కరీనంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత వకుళాంబరం కృష్ణమోహన్ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాంబరం, సభ్యులుగా శుభ‌ప్రద్ ప‌టేల్‌, కిశోర్ గౌడ్‌, సీహెచ్ ఉపేంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది.

kcr appoints huzurabad trs leader Vakulabharanam Krishna Mohan ap bc commission chairman

2016లో ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ కు తొలి చైర్మన్ గా సామాజిక వేత్త బీఎస్ రాములు వ్యవహరించగా, వకుళాభరణం కృష్ణమోహన్ (రచయిత, వక్త), డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరీశంకర్(రచయిత) సభ్యులుగా పనిచేశారు. మూడేళ్ల పదవీ కాలం తర్వాత కొత్త బాడీని ప్రకటించకపోవడంతో బీసీ కమిషన్ దాదాపు రెండేళ్లపాటు చేతనావస్తలో ఉండిపోయింది. మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యాన ఆ ఊరికి చెందిన టీఆర్ఎస్ నేత వకుళాంబరం కృష్ణమోహన్ చైర్మన్ గా బీసీ కమిషన్ మళ్లీ ప్రాణం పోసుకుంది.

తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్, సభ్యులకు పదవిలో ఉండే మూడేళ్లూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పిస్తారు. వెనుకబడిన తరగతుల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని వచ్చే అభ్యర్థనలను, బిసి జాబితా నుండి ఏ కులాన్నైనా తొలగించాలని వచ్చే ఫిర్యాదులను ఈ కమీషన్ పరిశీలించి విచారణకు స్వీకరిస్తుంది. పార్లమెంటులో ఇటీవలే ఓబీసీ బిల్లుకు ఆమోదం లభించడం, ఓబీసీ రిజర్వేషన్లపై రాష్ట్రాల నిర్ణయాలే ఇక చెల్లుబాటు కానున్న దరిమిలా తెలంగాణ బీసీ కమిషన్ మళ్లీ యాక్టివ్ కావడం కీలకంగా మారింది. అదే సమయంలో..

తెలంగాణ ఏర్పడ్డ ఏడేళ్ల తర్వాత, తొలిసారిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. టీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురై, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ను ఓడించేందుకు గులాబీ దళపతి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగా ప్రతిష్గాత్మక దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ఇప్పటికే రూ.1000 కోట్ల నిధులు ఇచ్చారు. హుజూరాబాద్ కే చెందిన బండ శ్రీనివాస్ కు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా, కాంగ్రెస్ ఫిరాయింపు నేత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఉద్యమకారుల్ని కేసీఆర్ మర్చిపోయారనే విమర్శకు విరుగుడుగా ఓయూ మాజీ విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హుజూరాబాద్ టికెట్ కేటాయించారు. ఇలా పథకాల దగ్గర్నుంచి పదవుల దాకా అన్నీ హుజూరాబాద్ కే ఇస్తుండటంపై జనంలో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. అన్నీ హుజూరాబాద్ కే ఇస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+