చంద్రబాబు ఏమన్నారు: గవర్నర్‌ను అడిగిన కెసిఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధీనంలో ఉన్న సచివాలయ భవనాలతోపాటు శాసనసభ, మండలి, విభాగాధిపతుల భవనాల అప్పగింత విషయంలో చంద్రబాబు నాయుడు ఏమన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌ను అడిగినట్లు సమాచారం. చంద్రబాబు వైఖరి ఎలా ఉందని ఆయన అడిగినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకొని వచ్చిన గవర్నర్‌తో ఆదివారం కెసిఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఏపీ పాలనను అమరావతికి తరలించిన నేపథ్యంలో, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న భవనాలను అప్పగించాలని ఇటీవలే తెలంగాణ కేబినెట్ చేసిన తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణకు కొత్త సచివాలయం కట్టుకుంటున్నామని, ఏపీ అధీనంలోని భవనాలు అప్పగించేలా చంద్రబాబును ఒప్పించాలని గవర్నర్‌కు కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే, గవర్నర్ నరసింహన్ ఏపీలో పర్యటించి, చంద్రబాబుతోనూ సమావేశమై చర్చించి వచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసినట్లు తెలిసింది.
భవనాలు అప్పగిస్తే సచివాలయ కార్యాలయాలతోపాటు విభాగాధిపతులకు సరిపోయేలా నిర్మాణాలు చేసుకుంటామని వివరించారు. కేబినెట్ తీర్మాన ప్రతిని నరసింహన్‌కు సమర్పించారు. అలాగే, కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును కూడా వివరించారు. ఆ తీర్పు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు.

తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. కృష్ణా నీటినంతా ఒక యూనిట్‌గా చేసి రాష్ట్రాలకు పంచితే బాగుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరించేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications