'ఎట్ హోమ్' కు దూరంగా బాబు..! హాజరవనున్న కేసీఆర్
హైదరాబాద్ : స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా.. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తేనీటి విందులో పాల్గొనబోతున్నారు.

స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో.. గవర్నర్ ఎట్ హోమ్ తేనీటి విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎంలతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా పాల్గొంటారు.
కాగా.. ఈసారి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇస్తున్న విందుకు చంద్రబాబు దూరంగా ఉండడానికి అధికారికంగా కారణాలేవి వెల్లడించనప్పటికీ.. ఏపీకి ప్రత్యేక రాజధాని అంటూ ఏర్పాటు కాని నేపథ్యంలో ఆయన అనంతపురంలో జరిగే స్వాతంత్ర్య వేడుకలకు హాజరవతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ఏపీ సీఎం నేటి షెడ్యూల్ లో గవర్నర్ ఎట్ హోం ప్రస్తావన లేనట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications