జీవన్ రెడ్డి BRS లో చేరికపై తేల్చేసిన కేసీఆర్, వాట్ నెక్స్ట్..!!
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరిక వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించారు. బీఆర్ఎస్.. బీజేపీ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్లు సిద్దంగా ఉన్నాయి. తన మద్దతుదారుల తో సమావేశం అయిన జీవన్ రెడ్డి తన ముందు ప్రత్యామ్నాయాల పైన వివరించారు. బీఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఈ సమయం లోనే ఒక కండీషన్ పైన చర్చ జరిగింది. కాగా.. జీవన్ రెడ్డి పార్టీలో రాక పై మాజీ సీఎం కేసీఆర్ తన నిర్ణయం ఏంటో పార్టీ ముఖ్యులకు తేల్చి చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు భేటీ అయ్యారు. గత వారం రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయమే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ భేటీ అయి చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఏప్రిల్ 27న ప్లీనరీ లేదా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించే యోచనలో గులాబీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్లీనరీ లేదా జనరల్ బాడీ పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరికపై కూడా చర్చించినట్లు సమాచారం.

జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, హరీష్
జీవన్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీలోకి కేటీఆర్ స్వయంగా ఆహ్వానించాలని సూచించారు. ఆ తరువాత కేసీఆర్‌తో జీవన్ రెడ్డి సమావేశం కానున్నారు. అటు జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ ప్రధాన అంశమని తెలిపారు. తనకు బీఆర్ఎస్ లో చేరితో తగిన గుర్తింపు ఇస్తామంటూ ఇచ్చిన హామీ పైన జీవన్ రెడ్డి ముఖ్యుల తో చర్చించారు. పార్టీ సభలో తనను కార్యకర్తల సమక్షంలో పార్టీలో చేరే విధంగా నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. దీంతో.. రంగారెడ్డి లేదా కరీంనగర్ లో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జీవన్ రెడ్డితో కేటీఆర్, హరీష్ భేటీ సమయంలో వెల్లడించనున్నారు. దీని ద్వారా జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.












Click it and Unblock the Notifications