ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్లీనరీ: దేశం దృష్టిని ఆకర్షించే కేసీఆర్ బిగ్ ప్లాన్!!
ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దేశం దృష్టిని ఆకర్షించే బిగ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని, వచ్చే ఎన్నికలకు బలంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించడానికి చాప కింద నీరులా పనిచేస్తున్న కేసీఆర్, ఇంకా పూర్తిస్థాయిలో అన్ని రాష్ట్రాల పైన దృష్టి సారించలేకపోతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణా పనులు ప్రారంభించిన కేసీఆర్ 2024 ఎన్నికల సమయానికి దేశంలో బలంగా దూకుడుగా ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అన్నదానిపై ఆలోచిస్తున్నారు. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఆకర్షించే ఆపరేషన్ ఆకర్ష కోసం కసరత్తులు చేస్తున్నారు.

ఏప్రిల్ లో బీఆర్ఎస్ ప్లీనరీ.. భారీ బహిరంగ సభకు ప్లాన్
వివిధ రాష్ట్రాలలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ వైపు ఆకర్షించడానికి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న కెసిఆర్ బిఆర్ఎస్ ప్లీనరీని అందుకు వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ప్లీనరీని అత్యంత ఘనంగా దేశం దృష్టిని ఆకర్షించే విధంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్లీనరీ వేదికగా పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చెయ్యటంతో పాటు, అతిపెద్ద బహిరంగ సభను నిర్వహించి, ఒక్కసారిగా దేశం దృష్టి బీఆర్ఎస్ పై పడేలా చేసి, ఆ తర్వాత వరుసగా రాష్ట్రాల పర్యటనలు చేయాలని గులాబీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తొలి ప్లీనరీ
సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్లీనరీని నిర్వహిస్తారు. అయితే గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అవసరం లేకున్నా ప్లీనరీని నిర్వహించారు. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అత్యంత ఘనంగా ప్లీనరీ నిర్వహించాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి షాక్ ఇచ్చేలా, బిజెపిని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నేతలను ప్లీనరీకి ఆహ్వానించి దేశం దృష్టిని ఆకర్షించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోని బిఆర్ఎస్ ఏర్పాటు జరిగిన తర్వాత జరగనున్న తొలి ప్లీనరీ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

బీఆర్ఎస్ ప్లీనరీ బహిరంగ సభకు వారికి ఆహ్వానం
బిఆర్ ఎస్ ప్లీనరీ సమావేశం తో పాటు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సభ వేదికగా బిజెపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ పార్టీని చూపించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ప్లీనరీ వేదికగా రాజకీయం రంజుగా మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు, బీహార్ సీఎం నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ప్లీనరీ వేదికగా కెసిఆర్ కొత్త వ్యూహం.. సక్సెస్ అవుతుందా?
మొత్తానికి సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అవి సక్సెస్ కాలేదు. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఆశించిన మేర ఫలితాలు రావటం లేదు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను భారీగా విస్తరించటానికి అవకాశాలు రాలేదు. మరి ప్లీనరీ వేదికగా స్థానికంగా పార్టీని బలోపేతం చెయ్యటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయటంతో పాటు దేశ రాజకీయాల కోసం చేస్తున్న కెసిఆర్ కొత్త వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications