కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు అదిరిపోయే వ్యూహం.. కీలక డేటా సేకరణతో ప్లాన్ ఇదే!!
తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత్ రాష్ట్ర సమితి గా మార్చి జాతీయస్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపికి ప్రత్యామ్నాయంగా దేశంలో రాజకీయాలను చేయాలని భావిస్తున్న కేసీఆర్ ఈ మేరకు విస్తరణ పనులను ప్రారంభించారు.

బీఆర్ఎస్ విస్తరణ పనుల్లో బిజీ
ఇప్పటికే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ దీనికి సంబంధించిన కార్యాచరణ పైన దృష్టి సారించి పని చేస్తున్న పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగువారి వివరాలను సేకరించి, ఆయా ప్రాంతాలలో అభ్యర్థులను కూడా సన్నద్ధం చేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ ప్రారంభించినట్లు సమాచారం. 2023 సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాలలో పోటీకి ఫోకస్ చేయడంతోపాటు, 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించి బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న చోటే మెయిన్ గా ఫోకస్
అయితే వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ అన్ని చోట్లా పోటీ చేసే వ్యూహంతో కాకుండా, తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న చోట, పోటీ చేసి ఓట్లు, సీట్లు సాధించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు అనే సమాచారాన్ని సేకరిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయా రాష్ట్రాల నుంచి అధికారికంగా సమాచారాన్ని సేకరించే పనిలో పడింది బి ఆర్ ఎస్.

కర్ణాటక రాష్ట్రంలో తెలుగువాళ్ళ ప్రభావం అధికం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తర్వాత, కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉన్నట్లుగా బీఆర్ఎస్ సమాచారం సేకరించింది. కర్ణాటక జనాభాలో దాదాపు 15 శాతం మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారని, కర్ణాటక రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నారని బీఆర్ఎస్ గుర్తించింది. కలబురిగి, బీదర్, కోలార్, బళ్లారి నాలుగు జిల్లాలలో దాదాపు 30 శాతం మంది తెలుగు ఓటర్లు ఉన్నారని బీఆర్ఎస్ గుర్తించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రాల వారీగా తెలుగువారి ప్రభావం ఉండే స్థానాల సమాచారం
28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న బెంగళూరులో కూడా భారీ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాసనసభా నియోజకవర్గాలలో 14 పార్లమెంట్ స్థానాల్లో వీరు ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు అధికారంగా గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా ఆయా స్థానాలపై బీఆర్ఎస్ పోకస్ పెట్టనుంది. ఇక మహారాష్ట్రలో 22 శాసనసభ 8 పార్లమెంటు స్థానాల్లో తెలుగు వారి ప్రభావం ఉంటుందని గుర్తించింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో 3 ఎంపీ స్థానాలు 12 శాసనసభ స్థానాలలో తెలుగు వారి ప్రభావం ఉంటుందని గుర్తించినట్లు సమాచారం.

సరిహద్దు రాష్ట్రాలలో డేటా సేకరణ.. అభ్యర్థుల ఎంపిక
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది తెలుగు ప్రజలు ఉండగా, ఒరిస్సా రాష్ట్రంలోని 12 లక్షల మంది తెలుగువారు ఉన్నారు. ఇక తమిళనాడు జనాభాలో 27 శాతం మంది తెలుగువారు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 18 పార్లమెంట్ స్థానాలలో వారి పాత్ర కీలకంగా ఉంటుందని బీఆర్ఎస్ గుర్తించింది. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ తెలుగువాళ్ళు ఉన్న ప్రాంతాలు, వారి ప్రభావం ఏమేరకు ఉంటుంది అన్న అంశాన్ని అంచనా వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది బి ఆర్ ఎస్.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications