కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్ - హరీష్ కు కీలక బాధ్యతలు..!?

తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం సంచలనంగా మారుతోంది. కవిత రాసిన లేఖతో మొదలైన వివాదం.. రోజు రోజుకీ ముదురుతోంది. తన తండ్రి.. బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానం చూపిస్తూనే కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. కవిత వ్యవహారం పైన కేసీఆర్ కీలక నేతలతో చర్చిస్తున్నారు. పార్టీ ముఖ్యులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇదే కవిత విషయంలో ఎవరూ స్పందించవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇక.. ఈ సమయంలోనే హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.

కేసీఆర్ మంత్రాంగం
కవిత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కవిత తన పట్టు వీడటం లేదు. తన అన్న కేటీఆర్ లక్ష్యంగా కవిత చేస్తున్న ఆరోపణలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని సీనియర్లు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. దీంతో.. కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు సమా చారం. బీజేపీ తో బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యల పైన కేసీఆర్ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. కవితకు పార్టీ నేతలు ఎవరూ మద్దతుగా మాట్లాడ వద్దని.. వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేయవద్దని కేసీఆర్ నిర్దేశించినట్లు సమాచారం. ఇదే సమయం లో పార్టీ కేడర్ లో ఈ వివాదం తో నిరుత్సాహ పడకుండా ఎలా వ్యవహరించాలనే అంశం పైన హరీష్ కు కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

kcr-changes-to-announce-key-position-for-harish-in-the-party-as-reports

హరీష్ కు బాధ్యతలు
ఇక.. పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన సొంత చెల్లి కవిత పరోక్షంగా చేస్తున్న విమర్శలతో పార్టీలో స్పందన ఏంటనేది ఆరా తీస్తున్నారు. కవిత వ్యాఖ్యలతో కేటీఆర్ సైతం మన స్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. కవిత వ్యవహారం వేళ వ్యూహాత్మకంగానే కేటీఆర్ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీలో కేటీఆర్ - కవిత వివాదం పార్టీ పైన లేకుండా అవసరమైతే కఠిన చర్యలకు సిద్దమని కేటీఆర్ సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగా అవసరం అయితే హరీష్ కు పార్టీ బాధ్యతల ను అప్పగించేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ ఫోన్లను కవిత లిఫ్ట్‌ చేయడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో సీనియర్‌ నేత హరీశ్‌రావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

కేసీఆర్ దిశా నిర్దేశం
కేసీఆర్ - హరీష్ భేటీలో కవిత అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను హరీశ్‌కు కేసీఆర్‌ అప్పగించారన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఒకవైపు పార్టీ అధి నేత కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరు కావాల్సి ఉండటం, మరోవైపు వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కేటీఆర్‌ సైతం ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో రెండోసారి నోటీసులు జారీ అయి, ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కవిత వ్యవహారం సమస్యగా మారిందని భావిస్తున్నారు. దీంతో.. పార్టీ నేతలు ఎవరూ కవిత విషయంలో స్పందించ వద్దని కేసీఆర్ సూచన చేసినట్లు తెలుస్తోంది. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఆ తరువాతనే కవిత విషయం.. పార్టీలో పదవుల మార్పు పైన కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+