వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15,000 జాబ్స్‌కు కెసిఆర్ ఓకే: 44ఏళ్ల వరకూ, జోనల్ ద్వారానే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులకు తీపి కబురు. రాష్ట్రంలో కొలువుల భర్తీకి ముఖ్యమంత్రి కెసిఆర్ పచ్చ జెండా ఊపారు. తొలి దశలో భాగంగా 15 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 15వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విభాగాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు.

తెలంగాణలో నిరుద్యోగ యువత నిరీక్షణ ఫలించింది. విపక్షాల పోరుకు ఫలితం దక్కింది! 15 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దస్త్రంపై కేసీఆర్‌ శనివారం సంతకం చేశారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచారు.

ప్రస్తుతం 34 ఏళ్లు పరిమితి ఉండగా దానిని 44 ఏళ్లకు పెంచాలని ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని నిరుద్యోగులకు మేలు కలిగించే రీతిలో పదేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

KCR clears job notification for 15,000

నలభై రోజుల వ్యవధిలో ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే కెసిఆర్ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జాబితాను రూపొందించి సీఎంకు సమర్పించారు. దానిని పరిశీలించిన కెసిఆర్ 15 వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ సహా పోలీసు, అగ్నిమాపక శాఖలలో 8,000 ఖాళీలను, విద్యుత్‌ శాఖలో 2,681 ఖాళీలు, భర్తీ చేయనుండగా, వ్యవసాయం, ఉద్యానవనాలు, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిసరఫరా, ఎక్సైజ్‌, వాణిజ్యపన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రోడ్లుభవనాలు, రవాణా, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోనివి 4,300 కొలువులను భర్తీ చేయనున్నారు.

జోనల్‌ వ్యవస్థ యథాతథంగా సాగుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, స్థానిక, స్థానికేతర కేటగిరిని అమలు చేస్తారు. ప్రస్తుతం రెండు జోన్లు ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జోనల్‌ విధానంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న ఇతర నిబంధనల మేరకు నియామకాలు జరుపుతారు.

మొదటి దశ ఆమోదించినవి కాక మరో వారం రోజుల్లో మరో 10,000 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమవుతోంది. అది అందగానే సీఎం ఆమోదం తెలపనున్నారు.
పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8,000, విద్యుత్‌ శాఖలో 2,681, ఇతర శాఖలో 4,300 ఉన్నాయి.

పోలీసు ఉద్యోగాలు రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ద్వారా జరగనున్నాయి. విద్యుత్ శాఖ ఉద్యోగాలను జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు భర్తీ చేయనున్నాయి. మిగిలిన ఖాళీల భర్తీ టీఎస్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా జరగనుంది.

ఉద్యోగాల నోటిఫికేషన్ పైన వివిధ పార్టీలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం... తెలంగాణ వచ్చాక ఉద్యోగాల కోసం ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలనే జరుపుకోలేదు.

English summary
There is heartening news for students and the unemployed in Telangana waiting for government job notifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X