వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మేడ్చెల్ నుంచి పోటీ..! సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి ఏది చేసినా సంచ‌నాలు న‌మోదు చేయాల్సిందే..! బ‌హిరంగ ఉప‌న్యాసాలు ఇచ్చినా, శాస‌న స‌భ‌లో మాట్ల‌డినా, ఫామ్ హౌలో కూర‌గాయ‌లు పండించినా, ధ‌ర్డ్ ఫ్రంట్ అంటూ హ‌డావిడి చేసినా, అసెంబ్లీని ర‌ద్దు చేసినా సంచ‌ల‌నంగానే నిలిచిపోయాయి. తాజా చంద్ర‌శేఖ‌ర్ రావు పోటీ చేసే నియోఎజ‌క వ‌ర్గాల‌పై కూడా ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం గజ్వేల్ నియోజ‌క వ‌ర్గంనుండి ప్రాతినిద్యం వ‌హిస్తున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ సారి రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 కేసీఆర్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే..! పోటీ చేసే అంశం కూడా ఆస‌క్తిక‌ర‌మే..!!

కేసీఆర్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే..! పోటీ చేసే అంశం కూడా ఆస‌క్తిక‌ర‌మే..!!

తొమ్మిది నెల‌ల ముందే అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన గులాబీ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ శివారులోని మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న గ‌జ్వేల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గ‌జ్వేల్ నుంచి పోటీ చేయ‌డంతోపాటు మేడ్చ‌ల్ నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

గులాబీ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌..! రెండిట్లో పోటీ ఎందుకన్న‌ సందేహం..!!

గులాబీ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌..! రెండిట్లో పోటీ ఎందుకన్న‌ సందేహం..!!

ఈ విష‌యంపై పార్టీ నాయ‌కులు, అత్యంత స‌న్నిహితుల వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఈ విష‌యం టీఆర్ఎస్ తోపాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకోవడం వెన‌క బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. తాను ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే న‌గ‌రం, చుట్టుప‌క్క‌ల ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం ఉండి వీలైన‌న్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. కాంగ్రెస్‌, తెదేపా, తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ క‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

 మేడ్చ‌ల్ లో పోటీ చేస్తే దాని ప్ర‌భావం న‌గ‌రం పై ఉంటుంద‌నేది కేసీఆర్ ప్లాన్..!!

మేడ్చ‌ల్ లో పోటీ చేస్తే దాని ప్ర‌భావం న‌గ‌రం పై ఉంటుంద‌నేది కేసీఆర్ ప్లాన్..!!

న‌గ‌రం, శివారు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ పార్టీల‌కు మంచి ప‌ట్టు ఉంది. ముఖ్యంగా టీడీపీకి బాగా ప‌ట్టు ఉంది. ప్ర‌ధానంగా సీమాంధ్రుల ఓట్ల‌పై టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఇదే విష‌యం త‌మకు క‌లిసి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ కూడా టీడీపీని క‌లుపుకుంది. వీరి పొత్తు కార‌ణంగా న‌గ‌రం, చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాలు ఎక్కువ‌గా ఆ పార్టీలు గెలుచుకుంటే ఇబ్బంది రావ‌చ్చ‌ని కూడా తెరాస అధినేత కేసీఆర్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. హైద‌రాబాద్ జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చ‌ల్ జిల్లాలో అయిదు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ స్థానాలు ఎవ‌రు గెలుచుకుంటే వారిదే అధికారం అనే ప్ర‌చారం ఉంది.

 కేసీఆర్ వ్యూహం ఎవ‌రికి అర్థం కాదు..! త‌ల‌లు ప‌ట్టుకుంటున్న విప‌క్షాలు..!!

కేసీఆర్ వ్యూహం ఎవ‌రికి అర్థం కాదు..! త‌ల‌లు ప‌ట్టుకుంటున్న విప‌క్షాలు..!!

మ‌హాకూట‌మికి ఎక్కువ స్థానాలు ద‌క్క‌కుండా చేయాలంటే బ‌ల‌మైన వ్యూహం ర‌చించాలి. ఇదే ఉద్దేశంతో మేడ్చ‌ల్ నుంచి తాను బ‌రిలో దిగితే, ఆ ప్ర‌భావం న‌గ‌రం, చుట్టు ప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌డి తెరాస‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావించి కేసీఆర్ ఈ దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే కేసీఆర్ 105 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మ‌రో 14 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థులు ప్ర‌క‌టించాల్సి ఉంది. అందులో మేడ్చ‌ల్ కూడా ఉంది. చంద్ర‌శేఖ‌ర్ రావు ఏది చేసినా అంతా ర‌హ‌స్యంగానే ఉంటుంది కాబ‌ట్టి పోటీ అంశం కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

English summary
In the coming Assembly polls, KCR expected to contest from Medchal constituency in the suburbs of Hyderabad. So far he is represented by Gajewal Assembly. In the next election, including Gajwel also contesting from Mehschl to be contesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X