• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ కుమార్తె కవిత ఆస్తులు ఎంతో తెలుసా..? అఫిడవిట్ ఏం చెబుతోంది..?

|

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత మరోసారి వార్తల్లో నిలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న సీఎం కేసీఆర్ కుమార్తె కవిత... తిరిగి హాట్‌టాపిక్స్‌లో నిలిచారు. అప్పటి వరకు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా కనిపించని కవిత... రాజ్యసభ సభ్యురాలిగా గులాబీ పార్టీ నుంచి ఢిల్లీకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ ఆమెను మండలికి పంపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఆ వెంటనే మండలిలో కవిత ఈ ఏడాది మార్చిలో నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి.

కవిత ఆస్తుల చిట్టా ఇదే..!

కవిత ఆస్తుల చిట్టా ఇదే..!

2019 ఎన్నికల్లో నిజామాబాదు ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్‌ నుంచి పోటీచేసిన కవిత తొలిసారిగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ పై ఓటమి చవిచూశారు. దీంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్న సంకేతాలు వచ్చాయి. ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఏడాదికి మళ్లీ రాజకీయాల్లో కమ్‌ బ్యాక్ ఇచ్చారు కవిత. ఇక తెలంగాణ ఎన్నికల సంఘంకు ఆమె దాఖలు చేసిన అఫడవిట్ ప్రకారం చరాస్తులు రూ.4.37 కోట్లు ఉండగా.. తన భర్త అనిల్ కుమార్ పేరుతో చరాస్తులు రూ.14.18 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక స్థిరాస్తుల విషయానికొస్తే భూములు భవంతుల పరంగా కవిత దంపతులకు రూ.9.10 కోట్లు మేరా ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఇక కవిత ఆదాయపు పన్ను శాఖ వద్ద దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌ను పరిశీలిస్తే ఆమె ఆదాయం 2015లో రూ.19.16 కోట్లు నుంచి 2019 నాటికి రూ.28.21 కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక గత ఐదేళ్లలో కవిత భర్త అనిల్ ఆర్థిక పరిస్థితి కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2017లో అత్యధిక ఆదాయం రూ.21.87 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

ఈ సంస్థల్లో కవిత పెట్టుబడులు

ఈ సంస్థల్లో కవిత పెట్టుబడులు

ఇదిలా ఉంటే కవిత పెట్‌పిక్సెల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ మరియు భారతీ జాగృతి ఫౌండేషన్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. ఇక తన భర్త అనిల్ ఆస్యపట్రా ఇన్వెంచర్స్, రెలిక్సిర్ ఫార్మాషూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ రెలిక్సిర్ 2011లో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా కార్యకాలపాలను ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అనిల్ కుమార్ లాంగెస్ట్ సర్వింగ్ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. కో- డైరెక్టర్‌గా వినుత ఉన్నారు. ఈ కంపెనీ మరో ఏడు కంపెనీలతో ఈ డైరెక్టర్ల ద్వారా అనుసందానమైంది. అయితే ఈ విషయం అఫిడవిట్‌లో లేదు.

 తెలంగాణలో పలుచోట్లు భూములు

తెలంగాణలో పలుచోట్లు భూములు

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ తన గారాలపట్టి అయిన కవితకు జడ్చర్ల దగ్గర ఉన్న మల్లెబోయినపల్లిలో 10 ఎకరాల 16 గుంటల భూమిని గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇక కవిత దంపతులు నిజామాబాదు, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేటల్లో వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో కమర్షియల్ బిల్డింగ్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. మాదాపూర్‌లోని ట్రెండ్స్ జేఆర్‌ కూడా వీరిదే అని తెలుస్తోంది. ఇక హైదరాబాదులో కొన్ని రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా కవిత దంపతులు కలిగి ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. దీంతో మొత్తం స్థిరాస్తుల విలువ రూ.9.10 కోట్లకు చేరింది.

ఇక 2010లో తెలంగాణ ఉద్యమం సమయంలో కవితపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొకటి మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి.

English summary
Former MP Kavitha Properties came into light after she had filed her affidavit with EC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X