వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కటిచాలు: కేసీఆర్, బ్రదర్‌కి గుత్తా షాక్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని జూలై ఏడో తేదీన ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, సంఘాల వారి సమక్షంలో ఈ విధానాన్ని ప్రకటిస్తామన్నారు.

పారిశ్రామిక విధానంపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పరిశ్రమల కార్యదర్శి అరవింద్ కుమార్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల కమిషనర్లు సోమేష్ కుమార్‌, శాలినీమిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం పారిశ్రామిక విధాన మార్గదర్శకాలను ఖరారు చేశారు. మార్గదర్శకాలపై సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ దేశాల్లో అధ్యయనంచేసి, పలుసార్లు సమావేశం నిర్వహించి, అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం దేశంలోనే తొలిసారన్నారు.

కేసీఆర్

కేసీఆర్

పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్‌ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు. టీఎస్‌ఐఐసీకి ఇప్పటికే 1.60 లక్షల ఎకరాల భూమిని అప్పగించామని, ఇకపై దాని ద్వారానే భూమిని కేటాయిస్తామని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలోని భూములను పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేస్తామని, వాటికి కావాలసిన విద్యుత్, నీరు, రహదారుల వంటి మౌలిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

పరిశ్రమలకు కేటాయించిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో మరో అవసరానికి బదలాయించొద్దని, ఈ మేరకు షరతులు విధిస్తామని, నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ అన్నారు. 2017 మార్చి నాటికి తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారుతుందని, పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ను అందజేస్తామని చెప్పారు.

గుత్తా

గుత్తా

నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి తెరాసలో చేరారు. ఆయన నల్గొండ - రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డెయిరీ) చైర్మన్‌గా ఉన్నారు.

గుత్తా

గుత్తా

గుత్తా జితేందర్ రెడ్డితో పాటు మదర్ డెయిరీ డైరెక్టర్ గంగుల కృష్ణా రెడ్డి, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర రావు తదిరులు గులాబీ కండువా కప్పుకున్నారు.

English summary
KCR Discusses Modalities for New Industrial Policy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X