కవిత వివాదం వేళ కేసీఆర్ అనూహ్య నిర్ణయం - పార్టీ కీలక పదవుల్లో మార్పులు..!?
కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో సంచలనంగా మారింది. పార్టీలో పరిణామాల పై కవిత చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కవిత విషయంలో సన్నిహిత నేతల తో కేసీఆర్ మంత్రాంగం చేసారు. కవిత పరోక్షంగా కేటీఆర్, సంతోష్, హరీష్ ను టార్గెట్ చేస్తున్నట్లు తాజా వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. ఈ సమయంలోనే కేటీఆర్ వ్యూహాత్మకంగానే విదేశాలకు వెళ్లారు. కవిత కామెంట్స్ పైన ఎవరూ స్పందించవద్దని పార్టీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేసీఆర్ అనూహ్య నిర్ణయాలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ మంత్రాంగం
కవిత లేఖ తరువాత కేసీఆర్ పరిస్థితులను గమనిస్తున్నారు. కవిత అమెరికా నుంచి తిరిగి వస్తూనే చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత పెరగకుండా ముందుగా కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. తన సోదరి వ్యాఖ్యల పైన కేటీఆర్ నేరుగా స్పందించ లేదు. ఏదైనా పార్టీ ఫోరంలోనే మాట్లాడాలని పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత పార్టీలోని ముఖ్య నేతలు కవిత వ్యాఖ్యల పైన స్పందించ లేదు. కేసీఆర్ కుమార్తె కావటం.. కుటుంబంలో వివాదంగా మారటంతో పార్టీ నేతలు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. కవిత వివాదం గురించి హరీష్ ఇప్పటి వరకు ఎక్కడా స్పందించ లేదు. కవిత ప్రధానంగా తన అన్న పైనే ఆగ్రహంతో ఉన్నట్లు తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది.

తదుపరి చర్యలు
కేటీఆర్ - కవిత పార్టీలో క్రియాశీలకంగా.. ఇద్దరు అంత సన్నిహితంగా కొనసాగుతున్న సమయంలో ఈ వివాదం ఎక్కడ మొదలైందనే అంశం పైన భిన్న వాదనలు ఉన్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది. కేసీఆర్ పైన గౌరవం చూపిస్తూ నే.. కవిత తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు జరిగాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ నష్టం చేస్తాయనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారు. కేసీఆర్ సైతం ఈ వ్యాఖ్యల పైన ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. కవిత చిట్ చాట్ లో చేసే వ్యాఖ్యల కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉండదనేది మరో వాదన. అయితే, కవిత విషయంలో కేసీఆర్ వేచి చూసే ధోరణితో ఉన్నారు. సమయం చూసి తన నిర్ణయం వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
పార్టీ పదవుల్లో మార్పులు
కవిత వ్యవహారం పైన కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత - కేటీఆర్ వివాదం పార్టీకి సమస్యగా మారకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీలో ప్రస్తుతం ఉన్న పదవుల్లో కీలక మార్పులు చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమా రం. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగింపు అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటార ది కీలకంగా మారుతోంది. హరీష్ రావుకు ప్రమోషన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కవిత వివాదం వేళ త్వరపడి నిర్ణయాలు తీసుకుంటే.. ప్రతికూల సంకేతాలు వెళ్తాయనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. దీంతో, వచ్చే వారం కేసీఆర్ తన కుమార్తె కవిత వివాదం.. పార్టీలో మార్పుల పైన కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications