ఎన్నేళ్లు పడుతుంది, కాదంటే చెప్పండి: అధికారులపై కెసిఆర్ ఆగ్రహం

యాదాద్రి పనుల్లో జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పనులు జరిగితే ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. మీకు చేతగాక పోతే చెప్పండి, ఎలా పూర్తి చేయాలో తనకు తెలుస

Recommended Video

    CM KCR Inspects Yadadri Development Works,sanctioned Rs 143 Crore

    యాదాద్రి: యాదాద్రి ఆలయ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. పనులు పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పనులు కూడా సగమే అయ్యాయని ఆయన అన్నారు.

    మీకు చేతనైతే చేయండి, లేకపోతే తప్పుకోండంటూ హెచ్చరించారు. పనులు పూర్తి చేయించడం ఎలాగో తనకు తెలుసునని అన్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా 20 ఏళ్లయినా ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు పూర్తికావని అన్నారు.

    ఆయన యాదాద్రి పనులను శుక్రవారంనాడు పరిశీలించారు. ఆలయ గోపుర నిర్మాణాన్ని పరిశీలిస్తూ- ఈ గోపురం మార్చి వరకు ఏ విధంగా పూర్తవుతుందని ఆర్కిటెక్ట్‌ ఆనందసాయిని అడిగారు. ఈ రకంగా పనులు చేస్తే బ్రహ్మోత్సవాలను ఏలా జరుపుతారని అడిగారు. శుక్రవారంనాడు ఆయన యాదాద్రి పనులను సమీక్షించారు.

    గోదావరిపై వంతెన ఏడాదిలో...

    గోదావరిపై వంతెన ఏడాదిలో...

    ఆలయ విస్తరణ కోసం దక్షిణం వైపున చేపట్టిన పనులను ఆయన పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు ముందు తాను వచ్చి చూసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని అన్నారు. గోదావరి నీళ్లలో వంతెన నిర్మాణ పనులు ఏడాదిలోపు చేస్తున్నారని, అటువంటిది ఇక్కడి పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అన్నారు. ఏదైనా పని పూర్తయిందా అని అడిగారు.

    24 గంటలు పని జరగాలి

    24 గంటలు పని జరగాలి

    రోజుకు 24 గంటలు పనులు సాగాల్సిందేనని కెసిఆర్ ఆదేశించారు. పనులు సాగుతున్న తీరును ప్రతివారం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో భూపాల్‌రెడ్డి సమీక్షిస్తారని చెప్పారు. ప్రతినెలా తాను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. అనంతరం ఆయన పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్‌ పనులను పరిశీలించారు. టెంపుల్‌సిటీ లేఅవుట్‌కు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం అలైన్‌మెంట్‌ మార్పును పరిశీలించి తగిన సూచనలు చేశారు.

    33 ఎకరాల్లో పుష్కరిణి

    33 ఎకరాల్లో పుష్కరిణి

    యాదాద్రిలో పుష్కరిణిని కొండకింద గల గండిచెరువులో 33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని కెసిఆర్ ఆదేశించారు. పక్కన బస్టాండ్‌, క్యూకాంప్లెక్స్‌ అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తులు కూర్చునేందుకు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రవచన ప్రాంగణం ఏర్పాటు చేయాలని సూచించారు యాదాద్రి టెంపుల్‌ సిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.143 కోట్లు ఆయన మంజూరుచేశారు.

    రింగ్ రోడ్డు ఇలా....

    రింగ్ రోడ్డు ఇలా....

    గుట్ట చుట్టూగల ఏడు రహదారులను కలుపుతూ ఆరు లైన్ల రహదారిగా రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు కెసిఆర్ తెలిపారు. యాదాద్రిలో 150మంది సాయుధ పోలీసులతో రాచకొండ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న యాదాద్రి పట్టణాన్ని మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

    ప్రత్యేక పూజలు

    ప్రత్యేక పూజలు

    యాదాద్రి బాలాలయంలో లక్ష్మీనరసింహ స్వామివారిని శుక్రవారం కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి శోభ, కోడలు శైలజ, మనుమడు హిమాంశుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామికి స్వర్ణపుష్పార్చనలు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం విడుదల చేసిన నూతన సంవత్సరపు డైరీని ఆవిష్కరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+