అక్కడ కేసీఆర్ కు కొత్త..! అందుకేనా సుడిగాలి పర్యటన?
హైదరాబాద్ : సీఎం హోదాలో గానీ అంతకుముందు గానీ రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే టీఆర్ఎస్ అధినేతకు ఎన్నికల ప్రచారం మాత్రం తొలిసారి కావడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడానికి ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తాండూరుకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న సభల్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు షాద్ నగర్ లో.. 4 గంటలకు ఇబ్రహీంపట్నం పబ్లిక్ మీటింగ్ లలో మాట్లాడనున్నారు. టీఆర్ఎస్ అధినేత రానుండటంతో జిల్లాకు చెందిన పార్టీశ్రేణులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సభలను విజయవంతం చేసేలా పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications