వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానమంత్రి రేసులోకి వచ్చిన కేసీఆర్.. పోటీగా ఇద్దరు??

|
Google Oneindia TeluguNews

జేడీయూ నేత నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందు నిలబడలేరని బీజేపీ నేత సుశీల్ మోడీ అన్నారు. మండల్, కమండల్ రెండు వర్గాల మద్దతు బీజేపీకి సంపూర్ణంగా ఉందని స్పష్టం చేశారు. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు తరుచుగా వినపడుతున్న వార్తలపై సుశీల్ స్పందించారు. మమతాబెనర్జీ, కేసీఆర్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకులు దేశంలో ఉన్నారని, అంత ప్రజాదరణ నితీష్ కు లేదన్నారు. జేడీయూ నేత తన సొంత రాష్ట్రంలోనే ప్రాభవాన్ని కోల్పోతున్నారని గుర్తుచేశారు. సుశీల్ మోడీ కూడా ఒకప్పుడు నితీష్ మంత్రివర్గంలో పనిచేసినవారే.

నితీష్ కంటే ప్రజాదరణ కలిగినవారున్నారు

నితీష్ కంటే ప్రజాదరణ కలిగినవారున్నారు


దేశంలో నితీష్ కంటే ప్రజారణ కలిగినవారు, శక్తివంతమైన నేతలు చాలామంది ఉన్నారని, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వారి రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ ఉందని సుశీల్ మోడీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందు నిలబడే పరిస్థితి నితీష్ కు లేదని, బీహార్ బయటకు ఆయన ప్రభావం ఏమీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి అన్నివర్గాల మద్దతుందనే విషయాన్ని నితీష్ మరిచిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు.

 రోజులు దగ్గరపడటంవల్లే..

రోజులు దగ్గరపడటంవల్లే..


బీజేపీకి ఓబీసీలతోపాటు అన్నివర్గాల మద్దతు ఉందని, నితీష్ కు రోజులు దగ్గర పడ్డాయని, అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శించారు. ఇందులో భాగంగానే ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకపోవడంతో ఏదో ఒక కారణం చెప్పి ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయారని సుశీల్ వెల్లడించారు.

బీహార్ కే పరిమితమంటున్న నితీష్!

బీహార్ కే పరిమితమంటున్న నితీష్!


నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లో మోడీకి వ్యతిరేకంగా కూటమి కడతారని, అందుకే ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చారని, ఆర్ జేడీ, కాంగ్రెస్ తో జట్టుకట్టారని పలురకాల విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే తనకటువంటి ఉద్దేశం ఏమీ లేదని, తాను బీహార్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని నితీష్ ప్రకటించారు. బీజేపీతో ఇబ్బందులు పడుతుండటంవల్లే కూటమి నుంచి బయటకు వచ్చారంటూ జేడీయూ మరో నేత ప్రశాంత్ కిషోర్ కూడా తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో నితీష్ మోడీకి వ్యతిరేకంగా కూటమి కడతారా? లేదంటే బీహార్ కే పరిమితమవుతారా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!

English summary
KCR entered the prime minister race
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X