"నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం"
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా పెట్టుకుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించిందని వివరించారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్ సత్తా ఇంకా తెలిసేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేదని ఇప్పుడు కుటుంబమంతా లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్నవాటిని ఆపేసిదన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని కేసీఆర్ అన్నారు. రైతులకు నీటిని అందించేందుకు నిర్మించిన చెక్ డ్యామ్ లను పేల్చివేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఇప్పుడు అనుసరిస్తున్న విధానమని కేసీఆర్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని వివరించారు. ఈ మేరకు పార్టీని గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తెలంగాణ భవన్ లో జరుగుతున్న పార్టీ సమావేశంలో వైసీపీ చీఫ్ జగన్ కు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రశంసించి.. దాని వ్యయ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. మరి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారన్న వార్త తెలియగానే ఆయన్ను చూసేందుకు అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు ఎగబడ్డారు. కేసీఆర్ ను చూసి పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. కేసీఆర్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పలికారు.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications