కేసీఆర్ ఫోకస్ ప్రధానంగా ఆ రాష్ట్రాలపైనే.. ప్రాంతీయ ఫార్ములాతో బీఆర్ఎస్; కేసీఆర్ మాస్టర్ ప్లాన్!!
తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్రీయ సమితి ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? దక్షిణాది రాష్ట్రాలపై ప్రధానంగా సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నారా? దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయం పై పోరాటం చేయడానికి కెసిఆర్ విస్తృత ప్రాంతీయ వాదాన్ని అస్త్రంగా ఎంచుకోనున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

ప్రాంతీయ వాదంతో తెలంగాణాలో పాగా వేసిన టీఆర్ఎస్
టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కెసిఆర్ రగిల్చిన పోరాట పటిమతో తెలంగాణ ప్రజానీకం మొత్తం సకల జనుల సమ్మె చేసి, కేంద్రంలోని అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చింది.
ఎంతోమంది తెలంగాణ యువకులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకొని అమరులయ్యారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించక తప్పలేదు. ఇక తెలంగాణ సెంటిమెంటుతో పోరాటం చేసిన కెసిఆర్ కు ప్రజలు పట్టం కట్టారు. గత రెండు దఫాలుగా టిఆర్ఎస్ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టి తమ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారు.

విస్తృత ప్రాంతీయ వాద నినాదంతో .. దక్షిణాది రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్
ఇదిలా ఉంటే తెలంగాణలో లోకల్ మార్కుతో అధికారం చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలకు మోడీ పాలనలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కెసిఆర్ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో బలంగా బాగా వేయగలిగితే మోడీ సర్కార్ కు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల స్థితిగతులపై అధ్యయనం చేశారు. ఇక విస్తృత ప్రాంతీయ వాదం ఫార్ములాతో కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం.. అదే ఆయుధంగా దక్షిణాదిలో పార్టీ విస్తరణకు ప్లాన్
తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నా, కేంద్రం నుండి అదేస్థాయిలో దక్షిణాది రాష్ట్రాలకు సహకారం అందడం లేదని సీఎం కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పై ఫోకస్ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కెసిఆర్ ఏర్పాటు చేయనున్న భారత్ రాష్ట్రీయ సమితి బి ఆర్ ఎస్ ను ముందుగా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలోనే విస్తరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించిన తర్వాత క్రమంగా ఉత్తరాది రాష్ట్రాలలోను పార్టీ విస్తరణకు దృష్టి సారించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

జాతీయ రాజకీయాలలోను అనూహ్యంగా విస్తృత ప్రాంతీయ వాదంతో కేసీఆర్
మొదటగా ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పార్టీ విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్న బీఆర్ఎస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం నేపథ్యంలో విస్తృత ప్రాంతీయ వాదం కీలకమైన ఫార్ములాగా కెసిఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రాంతీయ వాద పార్టీగా ప్రజల్లోకి వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ, జాతీయ రాజకీయాలలోను అనూహ్యంగా విస్తృత ప్రాంతీయ వాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించడం కెసిఆర్ మార్కు రాజకీయాలకు అద్దం పడుతుంది. మరి ఈ ప్రయత్నం లో కేసీఆర్ ఎంత మేరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications