ఇక్కడి మలయాళీలు మావాళ్లే, వారికీ పక్కా ఇళ్లు: కెసిఆర్, కేరళ సిఎం ప్రశంస(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో స్థిరపడిన మలయాళీలకు తెలంగాణవారితో సమానంగా గుర్తింపు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అలాగే ఇక్కడ స్థిరపడిన పేద మలయాళీలు అందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఫిల్మ్‌నగర్‌లో ఆదివారం కేరళ భవన్ నిర్మాణ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ శిల్ప కళాభవన్‌లో జరిగిన కేరళీయం-2015 కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు.
దేశంలోనే అత్యుత్తమ కేరళ భవన్‌ను ఏడాదిన్నరలోగా హైదరాబాద్‌లో నిర్మిస్తామని కెసిఆర్ చెప్పారు. ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్‌నగర్‌లో ఎకరం స్థలాన్ని, కోటి రూపాయలను మంజూరు చేసిందన్నారు. తమ రాష్ట్రంలో స్థిరపడిన కేరళీయులు తెలంగాణ ప్రజలు, సంస్కృతి, భాషలలో మమేకం అయ్యారని ముఖ్యమంత్రి కొనియాడారు.
హైదరాబాద్ నగరంలో సిక్కులు, మలయాళీలు, గుజరాతీయులు, సింధీలు, మహారాష్ట్రీయులు, బెంగళీయులు ఇలా విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలతో కలిసి మెలిసిపోయారని ముఖ్యమంత్రి అన్నారు. వారందరికీ తెలంగాణ ప్రజలతో సమానంగా గుర్తింపు ఇస్తున్నామన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజానీకం భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కేరళవాసులు ఎక్కడున్నా వారిలోని సేవాభావం గొప్పదని, నర్స్‌లుగా, నన్స్‌గా వారు మానవాళికి అందిస్తున్న సేవలు అజరామరమని ముఖ్యమంత్రి కొనియాడారు.

కెసిఆర్
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన మలయాళీలకు తెలంగాణవారితో సమానంగా గుర్తింపు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

కెసిఆర్
అలాగే ఇక్కడ స్థిరపడిన పేద మలయాళీలు అందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

కెసిఆర్
ఫిల్మ్‌నగర్‌లో ఆదివారం కేరళ భవన్ నిర్మాణ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు.

కెసిఆర్
ఈ సందర్భంగా మాదాపూర్ శిల్ప కళాభవన్‌లో జరిగిన కేరళీయం-2015 కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు.

కెసిఆర్
దేశంలోనే అత్యుత్తమ కేరళ భవన్‌ను ఏడాదిన్నరలోగా హైదరాబాద్‌లో నిర్మిస్తామని కెసిఆర్ చెప్పారు. ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్‌నగర్‌లో ఎకరం స్థలాన్ని, కోటి రూపాయలను మంజూరు చేసిందన్నారు.

కెసిఆర్
తమ రాష్ట్రంలో స్థిరపడిన కేరళీయులు తెలంగాణ ప్రజలు, సంస్కృతి, భాషలలో మమేకం అయ్యారని ముఖ్యమంత్రి కొనియాడారు.

కెసిఆర్
హైదరాబాద్ నగరంలో సిక్కులు, మలయాళీలు, గుజరాతీయులు, సింధీలు, మహారాష్ట్రీయులు, బెంగళీయులు ఇలా విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలతో కలిసి మెలిసిపోయారని ముఖ్యమంత్రి అన్నారు.

కెసిఆర్
వారందరికీ తెలంగాణ ప్రజలతో సమానంగా గుర్తింపు ఇస్తున్నామన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజానీకం భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

కెసిఆర్
కేరళవాసులు ఎక్కడున్నా వారిలోని సేవాభావం గొప్పదని, నర్స్‌లుగా, నన్స్‌గా వారు మానవాళికి అందిస్తున్న సేవలు అజరామరమని ముఖ్యమంత్రి కొనియాడారు.

కెసిఆర్
తెలంగాణ పునర్ నిర్మాణానికి, ఇక్కడ అక్షరాస్యత పెంపొందించడానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఇచ్చిన సూచనలు, సలహాలు ఎంతగానో దోహదపడ్డాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

కెసిఆర్
దక్షిణ భారత దేశానికి కేరళ కాశ్మీర్‌లాంటిదన్నారు. హైదరాబాద్ నగరంలోని 700 మంది పేద కేరళవాసులకు ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ వేదికపై నుంచే ప్రకటించారు.

కెసిఆర్
ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరమని, ఇది సుఖశాంతులకు, ఐక్యమత్యానికి ప్రతీక అన్నారు.

కెసిఆర్: కేరళీయులు
ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరమని, ఇది సుఖశాంతులకు, ఐక్యమత్యానికి ప్రతీక అన్నారు.

కెసిఆర్: కేరళీయులు
ఇక్కడికి భిన్న ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారికి హైదరాబాదీయులతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆదరణ ప్రశంసనీయమని ఆయన అన్నారు.

కెసిఆర్: కేరళీయులు
తెలంగాణ కొత్త రాష్ట్రానికి తమ రాష్ట్రం తరఫున అన్ని విధాలుగా స్నేహహస్తాన్ని అందిస్తామని చాందీ అన్నారు. మున్ముందు తెలంగాణతో తమకున్న బంధం మరింత బలపడుతుందన్నారు.

కెసిఆర్: కేరళీయులు
తెలంగాణలో కేరళభవన్‌కు స్థలం కేటాయించినట్టుగానే తమ రాష్ట్రంలోని శబరిలో తెలంగాణ భక్తుల కోసం పది ఎకరాల భూమి కేటాయించామని ఆయన గుర్తు చేశారు.

కెసిఆర్: కేరళీయులు
ఈ కార్యక్రమంలో ‘కేరళీయం-2015' ఆధ్వర్యంలో జరిగిన ఓనమ్ వేడుకలు, కేరళ సంస్కృతి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

కెసిఆర్: కేరళీయులు
మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావుతో పాటు ఎంపీలు కేశవరావు, వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పునర్ నిర్మాణానికి, ఇక్కడ అక్షరాస్యత పెంపొందించడానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఇచ్చిన సూచనలు, సలహాలు ఎంతగానో దోహదపడ్డాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. దక్షిణ భారత దేశానికి కేరళ కాశ్మీర్‌లాంటిదన్నారు. హైదరాబాద్ నగరంలోని 700 మంది పేద కేరళవాసులకు ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ వేదికపై నుంచే ప్రకటించారు.
ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరమని, ఇది సుఖశాంతులకు, ఐక్యమత్యానికి ప్రతీక అన్నారు. ఇక్కడికి భిన్న ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారికి హైదరాబాదీయులతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆదరణ ప్రశంసనీయమని ఆయన అన్నారు.
తెలంగాణ కొత్త రాష్ట్రానికి తమ రాష్ట్రం తరఫున అన్ని విధాలుగా స్నేహహస్తాన్ని అందిస్తామని చాందీ అన్నారు. మున్ముందు తెలంగాణతో తమకున్న బంధం మరింత బలపడుతుందన్నారు. తెలంగాణలో కేరళభవన్‌కు స్థలం కేటాయించినట్టుగానే తమ రాష్ట్రంలోని శబరిలో తెలంగాణ భక్తుల కోసం పది ఎకరాల భూమి కేటాయించామని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ‘కేరళీయం-2015' ఆధ్వర్యంలో జరిగిన ఓనమ్ వేడుకలు, కేరళ సంస్కృతి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావుతో పాటు ఎంపీలు కేశవరావు, వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications