Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింధు ఒక్కరు చాలదు: కెసిఆర్, ఆశ్చర్యానికి గురిచేసిన గవర్నర్(పిక్చర్స్)

హైదరాబాద్: ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధులాంటి క్రీడాకారులను మరింతమందిని తయారుచేయటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడావిధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి, చరిత్ర సృష్టించిన పీవీ సింధులాంటి క్రీడాకారులు ఊరికొకరు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్ నాటికి క్రీడా విధానాన్ని రూపొందించి, తగిన నిధులను కేటాయిస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతోమంది ప్రతిభావంతులున్నారని, మట్టిలో దాగున్న అలాంటి మాణిక్యాలను వెలికితీస్తామని తెలిపారు. ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, కోచ్‌లు క్రీడాసంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామరని వెల్లడించారు.

దేశం గర్విస్తోంది: సింధును ఆశ్చర్యానికి గురిచేసిన గవర్నర్

దేశ కీర్తిప్రతిష్ఠలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన నిన్ను చూసి ఈ దేశం గర్విస్తోందని ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధును గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచావని కొనియాడారు. మున్ముందు నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని భుజం తట్టారు. సోమవారం సాయంత్రం సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. వారిద్దరూ దర్బార్‌హాల్‌లోకి రాగానే గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, రాజ్‌భవన్‌ సిబ్బంది స్వాగతం పలికారు.

అంతేగాక, సింధుతో కేక్ కట్ చేయించారు. సింధు తన ప్రతిభతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తల్లి, తండ్రి, గురువు, దేవుడు లాంటి నాలుగు శక్తులు కలిసి పనిచేశాయని గవర్నర్‌ అభివర్ణించారు. పూర్తిస్థాయి దీక్ష, పట్టుదలతో విజయాన్ని సొంతం చేసుకున్నావని ఆమెను అభినందించారు.

సింధు మాట్లాడుతూ ''నా కల నిజమైంది. దేవుడి దయతో ఈ విజయం సొంతమైంది. నా విజయానికి కృషి చేసిన కోచ్‌కు ధన్యవాదాలు'' అని పేర్కొంది. తమకు గవర్నర్ నుంచి లభించిన స్వాగతం ఊహించలేనిదని తెలిపింది. తమకు గవర్నర్ దంపతులు చేసిన సత్కారంపై సింధు ఆశ్చర్యం పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అకాడమీ నెలకొల్పే సమయంలో గవర్నర్‌ చేసిన సహాయానికి గోపీచంద్‌ ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్‌ తమకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చారన్నారు. అనంతరం సింధు, గోపీచంద్‌లతో పాటు ఒలింపిక్స్‌లో ప్రతిభ చాటిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు గవర్నర్‌ జ్ఞాపికలు అందజేశారు. గోపిచంద్‌ అకాడమీ అభివృద్ధికి రూ.2 లక్షల చెక్కు ఇచ్చారు.

కెసిఆర్‌ను కలిసిన సింధు, గోపీచంద్

కెసిఆర్‌ను కలిసిన సింధు, గోపీచంద్

ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధులాంటి క్రీడాకారులను మరింతమందిని తయారుచేయటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడావిధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

గోపీకి సన్మానం

గోపీకి సన్మానం

ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి, చరిత్ర సృష్టించిన పీవీ సింధులాంటి క్రీడాకారులు ఊరికొకరు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్ నాటికి క్రీడా విధానాన్ని రూపొందించి, తగిన నిధులను కేటాయిస్తామని చెప్పారు.

అంతా నవ్వులే

అంతా నవ్వులే

హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతోమంది ప్రతిభావంతులున్నారని, మట్టిలో దాగున్న అలాంటి మాణిక్యాలను వెలికితీస్తామని తెలిపారు.

రూ. 5కోట్ల చెక్కు అందిస్తూ..

రూ. 5కోట్ల చెక్కు అందిస్తూ..

ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, కోచ్‌లు క్రీడాసంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామరని వెల్లడించారు.

అభినందిస్తూ..

అభినందిస్తూ..

ఒలింపిక్స్‌లో పతకం సాధించి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సింధు, ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సోమవారం సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. తాను సాధించిన పతకాన్ని సింధు సీఎంకు చూపించారు.

సాధించారు.. ఇంకా ఉంది

సాధించారు.. ఇంకా ఉంది

ఆమెను అభినందించిన కేసీఆర్‌ ఘనంగా సన్మానించి, రూ.5 కోట్ల చెక్కును అందించారు. గోపీచంద్‌ను సన్మానించి, ఆయనకు రూ.కోటి చెక్‌ను ఇచ్చారు. సింధు దేశం గర్వపడేలా ప్రతిభను ప్రదర్శించి పతకం సాధించడం అభినందనీయమన్నారు.

ఆనందం విరిసింది

ఆనందం విరిసింది

కోచ్‌ గోపీచంద్‌ తన అకాడమీ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారన్నారు. సింధును ప్రోత్సహించిన తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలను సీఎం అభినందించారు.

ఆనందం విరిసింది

ఆనందం విరిసింది

ఇంత పెద్ద దేశం కేవలం రెండు పతకాలే గెలిచిందన్న విమర్శ ఉందని అన్నారు. దేశంలో క్రీడాకారులు ఎవరికి వారే ఎదిగి పతకాలు సాధిస్తున్నారు తప్ప ప్రభుత్వపరంగా సరైన ప్రోత్సాహం లభించడం లేదనే
భావన ఉందని కేసీఆర్‌ అన్నారు.

ఆనందం విరిసింది

ఆనందం విరిసింది

భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్‌ పతకాలు సాధించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో పాఠశాలల్లో అటలు ఆడేవారని, ఇప్పుడు కేవలం పరీక్షల్లో మార్కులు సంపాదించడమే ధ్యేయంగా క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అభినందిస్తున్న కొండా సురేఖ

అభినందిస్తున్న కొండా సురేఖ

క్రీడల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వపరంగా కూడా మరింత చొరవ అవసరమన్నారు. తెలంగాణలో చాలా మంది క్రీడాకారులున్నారని, క్రీడాసక్తి ఉన్న పిల్లలందరికీ తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

అభినందిస్తూ..

అభినందిస్తూ..

హైదరాబాద్‌ నగరంలో ఉన్న క్రీడా ప్రాంగణాలన్నింటినీ ఉపయోగంలోకి తేవాలన్నారు. జిల్లాల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామన్నారు. హకీంపేటలో క్రీడల కోసం కేటాయించిన 300 ఎకరాలను సంపూర్ణంగా వినియోగించాలని సూచించారు.

క్రీడాకారులకు అభినందన

క్రీడాకారులకు అభినందన

విశ్వక్రీడాపోటీల వేదికగా హైదరాబాద్‌ను మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ పిల్లలు అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూనుకుంటుందన్నారు.

దర్శకుడు ఎన్ శంకర్ అభినందన

దర్శకుడు ఎన్ శంకర్ అభినందన

సింధుకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన చల్లగుండ్ల కిరణ్‌కు రూ.25 లక్షలు, ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు శ్రీకాంత్‌కు రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

కెసిఆర్‌తో..

కెసిఆర్‌తో..

ప్రపంచంలోని టాప్‌ 50 బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల్లో ఆరుగురు గోపీచంద్‌ అకాడమీ వారే కావడం గర్వకారణమని, ఆ అకాడమీకి అవసరమైన ఆర్థిక చేయూతనిస్తామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ గోపీచంద్‌ అకాడమీలను ఏర్పాటు చేయాలన్నారు.

సాధించిన పతకం

సాధించిన పతకం

ఈ సందర్భంగా సింధును మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీలు కొండా మురళి, పూల రవీందర్‌, వెంకట్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సలీం తదితరులు అభినందించారు. తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌లో సింధు

రాజ్‌భవన్‌లో సింధు

దేశ కీర్తిప్రతిష్ఠలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన నిన్ను చూసి ఈ దేశం గర్విస్తోందని ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధును గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు.

గవర్నర్ అభినందనలు

గవర్నర్ అభినందనలు

భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచావని కొనియాడారు. మున్ముందు నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని భుజం తట్టారు.

రాజ్‌భవన్‌లో సింధు

రాజ్‌భవన్‌లో సింధు

సోమవారం సాయంత్రం సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. వారిద్దరూ దర్బార్‌హాల్‌లోకి రాగానే గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, రాజ్‌భవన్‌ సిబ్బంది స్వాగతం పలికారు.

రాజ్‌భవన్‌లో సింధు

రాజ్‌భవన్‌లో సింధు

సింధు తన ప్రతిభతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తల్లి, తండ్రి, గురువు, దేవుడు లాంటి నాలుగు శక్తులు కలిసి పనిచేశాయని గవర్నర్‌ అభివర్ణించారు.

రాజ్‌భవన్‌లో సింధు

రాజ్‌భవన్‌లో సింధు

పూర్తిస్థాయి దీక్ష, పట్టుదలతో విజయాన్ని సొంతం చేసుకున్నావని ఆమెను అభినందించారు. గోపీచంద్‌ భవిష్యత్తు ముందుగానే వూహించారని, తాము తొలుత కలిసినప్పుడే ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధిస్తుందని చెప్పారని గవర్నర్‌ గుర్తుచేశారు.

రాజ్‌భవన్‌లో సింధు

రాజ్‌భవన్‌లో సింధు

టీవీ ముందు కూర్చుని మ్యాచ్‌, ప్రెస్‌మీట్‌ ముగిసేవరకు చూశానని చెప్పారు. సింధు మాట్లాడుతూ ‘‘నా కల నిజమైంది. దేవుడి దయతో ఈ విజయం సొంతమైంది. నా విజయానికి కృషి చేసిన కోచ్‌కు ధన్యవాదాలు'' అని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+