• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న‌రేంద్ర‌మోడీ నోబాల్‌.. కేసీఆర్ సిక్స‌ర్‌? అదిరిందిగా..!!

|
Google Oneindia TeluguNews

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రినీ ఆక‌ర్షిస్తున్న నేత ఇప్పుడు ఒక్క‌రే ఉన్నారు. ఆయ‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ఢీకొట్ట‌డంద్వారా ఆయ‌న ఎటువంటి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు? ఎటువంటి వ్యూహాలు అమ‌లు చేయ‌బోతున్నారు? అనేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

నోబాల్‌కు ఏడు ప‌రుగులిచ్చిన మోడీ!

నోబాల్‌కు ఏడు ప‌రుగులిచ్చిన మోడీ!

జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసి, మూడురోజులు ఇక్క‌డ గ‌డ‌ప‌డంద్వారా తెలంగాణ‌లో చొచ్చుకుపోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో న‌రేంద్ర‌మోడీ కేసీఆర్‌పై బాల్ విసిరార‌ని, కానీ అది నోబాల్ అని, దాన్ని కేసీఆర్ సిక్సర్ కొడితే స్టేడియం బ‌య‌ట‌ప ప‌డింద‌ని, మొత్తం ఏడుప‌రుగులు వ‌చ్చాయ‌ని టీఆర్ ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

బీఆర్ ఎస్ పార్టీ స్థాప‌న ద్వారా సిక్స‌ర్ కొట్టార‌ని, దానికి ప్ర‌తినిధులుగా నిజాయితీప‌రులు, స‌మ‌ర్థులైన‌వారిని ఎన్నిక చేస్తున్నార‌ని భావిస్తున్నారు. ఉత్త‌రాది బాధ్య‌త‌లు రైతు ఉద్య‌మ నేత టికాయ‌త్‌కు అప్ప‌గిస్తున్నార‌ని, ప్ర‌తి రాష్ట్రంలో స‌మ‌ర్థులు, విజ‌యంవ‌త‌మైన వ్య‌క్తులు, ప్రజల్లో ఇమేజ్ ఉన్న‌వారిని ఎంపిక చేస్తున్నార‌ని, ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపొంద‌డం అంత సులువుకాద‌ని, సీబీఐ, ఈడీల‌ను ప్ర‌యోగించినా కష్టమేననే భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

రాబోయే ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ ప‌రిస్థితి ఇదీ!!

రాబోయే ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ ప‌రిస్థితి ఇదీ!!

జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డంద్వారా దేశం దృష్టితోపాటు తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ బీజేపీవైపు చూసేలా చేయాల‌న్న దృక్ప‌థంతో న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ఉన్నారు. అయితే మోడీ ఇక్క‌డ మూడురోజుల మకాం వేసి భారీ డైలాగుల‌తోపాటు భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసి వెళ్లిన త‌ర్వాత టెంటు సామాన్లువారు వారి సామాన్లు తీసుకువెళ‌తార‌ని, మ‌రో మూడురోజులు గ‌డిచిన త‌ర్వాత చూస్తే అక్క‌డ స‌మావేశం జ‌రిగింద‌న్న ఆన‌వాళ్లే క‌న‌ప‌డ‌వ‌ని, రాబోయే ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ ప‌రిస్థితి కూడా అలాగే ఉండ‌బోతోంద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన సీనియ‌ర్ నేతలు విశ్లేష‌ణ చేస్తున్నారు.

క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి బ‌ల‌ముందా?

క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి బ‌ల‌ముందా?

తెలంగాణ‌లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీకి అస‌లు క్షేత్రస్థాయిలో బ‌లం ఉందా? అనేది ఇప్పుడు అంద‌రినీ తొలిచేస్తున్న అనుమానం. టీఆర్ ఎస్‌కు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత క్షేత్ర‌స్థాయి బ‌లంకానీ, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ట్టుకానీ లేదు. కానీ టీఆర్ఎస్‌ను మ‌ట్టిక‌రిపిస్తాం.. అధికారంలోకి వ‌చ్చేది మేమే అని మాట్లాడుతుండ‌టం హాస్యాస్ప‌దంగా ఉందంటున్నారు విశ్లేష‌కులు.

వాపు చూసుకొని బలుప‌నుకుంటే ఎలా?

వాపు చూసుకొని బలుప‌నుకుంటే ఎలా?

తెలంగాణ‌లో దుబ్బాక‌, హుజూరాబాద్‌తోపాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కొన్ని సీట్లు సాధించినంత‌మాత్రాన వాపు చూసుకొని బ‌లుప‌నుకుంటే ఉప‌యోగం ఉండ‌ద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు ఆ పార్టీపై మండిప‌డుతున్నారు. రాష్ట్రానికి జేపీ న‌డ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్ షా లాంటి నేత‌లు వ‌చ్చి వెళుతున్నార‌ని, వారంతా పొలిటిక‌ల్ టూరిస్టుల‌నీ, కేసీఆర్ లోక‌ల్ అనే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని కేటీఆర్ ట్విట్ట‌ర్‌తో తూటా పేల్చారు.

ప్ర‌చార గిమ్మిక్కులు వ‌ద్దు.. వాస్త‌వాలుంటే చాలు

ప్ర‌చార గిమ్మిక్కులు వ‌ద్దు.. వాస్త‌వాలుంటే చాలు

2014లో గుజ‌రాత్ వెలిగిపోతోందంటూ భారీ ప్ర‌చార గిమ్మిక్కుల‌తో ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టింప‌చేసుకొని అధికారంలోకి వ‌చ్చిన న‌రేంద్ర‌మోడీ రెండోసారి కూడా ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. త‌ర్వాత వాస్త‌వాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వ‌సాగాయి. ప్ర‌చారం చేసిన త‌ర‌హాలో ఆయ‌న ప‌నితీరు ఉండివుంటే దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు ఉండేదికాద‌ని, జీఎస్‌టీ వ‌చ్చేది కాద‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు. సీబీఐ, ఈడీల‌ను ఉప‌యోగించి ప్ర‌త్య‌ర్థుల‌ను బెదిరించి లోబ‌రుచుకోవ‌డంలాంటి రాజ‌కీయం గ‌తంలో అంద‌రూ చేయ‌లేక కాద‌ని, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ప్ర‌తిప‌క్షాలు కేంద్రంలోని బీజేపీకి సూచిస్తున్నాయి.

English summary
KCR going to face Narendra Modi through BRS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X