తెలంగాణ అసెంబ్లీలో కాగ్‌ రిపోర్ట్ -పరిమితికి లోబడే అప్పులు -ఐదేళ్లలో రూ.76,262 కోట్లు తీర్చాలి

తెలంగాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు.. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తెలిపింది. 20218-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వరంగ సంస్థలపై కాగ్ నివేదికను కేసీఆర్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థితిగతులను ఈ నివేదికలో కాగ్ స్పష్టంగా వివరించింది. సామాజిక, ఆర్థిక రంగాలు, రెవెన్యూ, ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక ఇచ్చింది.

ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నప్పటికీ ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు మినహా ఇతర రాబడి లేదని కాగ్‌ వ్యాఖ్యానించింది. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్‌ తయారీ ప్రక్రియను వాస్తవాలకు దగ్గరగా ఉండేలా చూడాలని సూచించింది. వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, విద్య, రవాణా, క్రీడలు, కళలకు ఖర్చును బాగా తగ్గిస్తోందని కాగ్‌ అభిప్రాయపడింది.

సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వాటి ఆర్థిక ఫలితాలను ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్ పేర్కొంది. విద్యుత్ రంగంలో డిస్కంల భారీ నష్టాలు.. పీయూసీల నష్టానికి కారణం అయిందని, విద్యుత్ రంగంలో పీయుసీల నష్టం రూ.28 వేల 426 కోట్లుగా తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థ తక్షణ అవసరాల నిధుల నిర్దిష్ట అంచనా లేకుండా అధిక వడ్డీ రుణం రూ.539 కోట్లు వాడుకున్నదని..ఫలితంగా 8.51కోట్ల వడ్డీ వ్యయం అయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

kcr govt Introduces CAG Report of 2018-19 in ts Assembly, key remarks on deficit and debts

2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్‌ రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చుల పెరుగుదల 2015-16 నుంచి 2018- 19 మధ్య కాలంలో మెరుగైందని, జీఎస్డీపీలో రెవెన్యూ రాబడి, ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. అంతకు ముందుతో పోల్చినా, జీఎస్టీడీపీతో పోల్చినా క్యాపిటల్‌ వ్యయం తగ్గిందని పేర్కొంది.

14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 3.25శాతం కన్నా ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగానే 3.11శాతం ఉందని పేర్కొంది. చెల్లించాల్సిన రుణ బాధ్యతలు జీఎస్డీపీతో పోల్చితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 23.33 శాతం కన్నా తక్కువగానే 22.75 శాతం ఉందని తెలిపింది. 2019 మార్చి నాటి ప్రకారం ప్రభుత్వ అప్పులలో 46శాతం రూ,76,262 కోట్లను రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉంది. శాసనసభ ఆమోదం లేకుండా 2014-15 నుంచి 2017-18 మధ్య రూ.55,517 కోట్లు అధికంగా ఖర్చే చేసిందని, వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాగ్‌ సిఫారసు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+