బాగా రిసీవ్ చేసుకున్నారు: కెసిఆర్ ఖుషీ, ఇంటికి వస్తానని కోడెలతో మాట

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లినప్పుడు తనను బాగా రిసీవ్‌ చేసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలతో అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆహ్వానం మేరకు ఈనెల 22న అమరావతికి వెళ్లిన విషయం తెలిసిందే.

అదే రోజు ఆయన నల్గొండ జిల్లా సూర్యాపేట, మెదక్‌ జిల్లా ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆనందంగా కనిపించారని అంటున్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు తాను హాజరుకావటంపై ప్రజలు ఏమనుకుంటున్నారని, కార్యక్రమం జరిగిన తీరు ఎలా ఉం దని ప్రశ్నిస్తూ ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

KCR - Chandrababu

"మీ నియోజకవర్గంలో మీరు చేసిన వినూత్న తరహా అభివృద్ధి గురించి నాకు తెలిసింది. మీ మోడల్‌ చూసి నేను తెలంగాణాలో అమలు పరచటానికి కృషి చేస్తా! మీ ఇంటికి వస్తాను" అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు అన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్‌కు ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

అనంతరం కోడెలను చూసిన కేసీఆర్‌ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. "నువ్వు కాదన్నా.. నేనే మీ ఇంటికి వస్తా! స్వచ్ఛ భారత్‌లో భాగంగా మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసింది. ఈ ప్రాజెక్టును మోడల్‌గా తీసుకుని మా రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యడానికి చర్యలు తీసుకుంటాను. అన్నీ మాట్లాడుకుందాం" అని కేసీఆర్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+