కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఏడేళ్లుగా మద్దత్తు.!రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే సహించమన్న మధు యాష్కి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు తెలంగాణ ప్రజల ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ అవసరాల గురించి, ఆకాంక్షల గురించి విలేఖరుల సమావేశాల్లో తనకంటే ఎవరికి ఎక్కువ తెలుసని మండి పడే ముఖ్యమంత్రి కి అసలు తెలంగాణ ప్రయోజనాల గురించి ఏమీ తెలియదని మధు యాష్కి ధ్వజమెత్తారు. రాష్ట్ర అవసరాల గురించి అవగాహన లేకనోడంతో పాటు కేంద్రానికి నివేదికలరు రూపొందించి పంపించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని విమర్శించారు. తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంతో చంద్రశేకర్ రావు చర్చాంచారా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలేనని మధు యాష్కి గుర్తు చేసారు. వీటి పైన ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రావు నిలదీసారా అని, వారిద్దరి మద్య లోపాయకార ఒప్పందానికి ఇది నిదర్శనం కాదా అని సూటిగా ప్రశ్నించారు.

అంతే కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్ లో అండగా నిలిచిన చంద్రశేఖర్ రావు, ఇప్పుడు గల్లీల్లో నాటకాలు ఆడతూ అండగా నిలిచారని మండిపడ్డారు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా, ఇప్పుడు ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటున్న కేటీఆర్ కు ఇన్నేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు రాలేదని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే కదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావుకు బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ, ధరలు పడిపోయి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు మాత్రం సమయం ఉండదని విమర్శించారు. కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి 1000 రూపాయల ధర పడిపోయిందని, వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై సంబంధిత మంత్రిగానీ, ముఖ్యమంత్రి గానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని మధు యాష్కి డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications