వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆరే ప్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారన్న తలసాని.!మునుగోడులో మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.!

|
Google Oneindia TeluguNews

మునుగోడు/హైదరాబాద్: ప్లోరైడ్ భూతం నుండి విముక్తి కల్పించిన ఘనత అధికార బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తలసాని మాట్లాడారు. ప్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని కోరితే నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చొరవతో ప్లోరిన్ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడిందన్నారు.

ప్రచారంలో వేగం పెంచిన గులాబీ.. ఇంటింటికి ప్రచారం నిర్వహించిన మంత్రులు

ప్రచారంలో వేగం పెంచిన గులాబీ.. ఇంటింటికి ప్రచారం నిర్వహించిన మంత్రులు

అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి స్వార్ధం కోసం వచ్చిందని, ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సంవత్సరాల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకొచ్చిందా అని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి తలసాని చురకలంటించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ను మరిచి, కాంట్రాక్టు ల పైనే శ్రద్ధ. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ కు మద్దతు తెలపాలి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ.. ఓట్లు అడుగుతూ ప్రచారం. స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ఉప ఎన్నిక‌కు కార‌ణమైనా బీజేపీ అభ్య‌ర్థికి గుణ‌పాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

మునుగోడులో మంత్రుల ప్రాచారం.. తలసానికి ఘన స్వాగతం పలికిన స్థానికులు

మునుగోడులో మంత్రుల ప్రాచారం.. తలసానికి ఘన స్వాగతం పలికిన స్థానికులు

మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స‌ర్వేల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఎనిమేదేళ్ళ‌లో టీఆర్ఎస్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి కాలనీవాసులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, తిలకం దిద్ది ఆశీర్వదించారు. వృద్ధులను అక్కున చేర్చుకొని పింఛన్‌ వస్తుందా అంటూ మంత్రి ఇంద్రకరన్ రెడ్డి ఆరా తీశారు.

మా ఓటు కారుకే.. మునుగోడు ప్రజల మనోభావాలు తెలుసుకున్న మంత్రులు

మా ఓటు కారుకే.. మునుగోడు ప్రజల మనోభావాలు తెలుసుకున్న మంత్రులు

ఇదిలా ఉండగా ఎవ‌రికీ ఓటు వేస్తారని మంత్రి వృద్దుల‌ను అడుగ‌గా సీఎం సారుకే మా ఓటు అని స్ప‌ష్టం చేసినట్టు మంత్రి తెలిపారు. తమ ఇంటికి ఓట్లు అడగడానికి వచ్చిన మంత్రిని వృద్ధులు ఆశీర్వదించారు. ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సీఎం చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. టీఆర్‌ఎస్‌ను మరోసారి దీవించాలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్య‌ర్థించారు.

మంత్రి వాహ‌నాన్నిత‌న‌ఖీలు చేసిన పోలీసులు.. ఇంద్రకరణ్ రెడ్డి విస్త్రుత ప్రచారం

మంత్రి వాహ‌నాన్నిత‌న‌ఖీలు చేసిన పోలీసులు.. ఇంద్రకరణ్ రెడ్డి విస్త్రుత ప్రచారం

కాంట్రాక్టుల కోసం, స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ మారి ఉప ఎన్నిక‌లకు కార‌ణ‌మైన బీజేపీ అభ్య‌ర్థికి ఈ ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పాల‌న్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అనంత‌రం శ్రీనివాస ఫంక్ష‌న్ హాల్ లో నిర్మల్ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు, స‌ర్వేల్ గ్రామ‌ ముఖ్య నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌తో సమన్వయ, సమావేశం నిర్వహించారు. అంత‌కుముందు శ్రీరామ లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక పూజలు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ళుతున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వాహ‌నాన్ని ఆపి పోలీసులు త‌నిఖీ చేశారు.

English summary
Minister Thalasani Srinivas Yadav clarified that the credit of getting rid of the fluoride specter goes to the ruling BRS government. Thalasani spoke at a meeting of BRS workers at the Nampalli mandal center under Munugodu constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X