గద్వాలను గబ్బు పట్టించిందెవరు? ఏపీ సీఎం వల్లే అన్యాయం జరిగింది: కేసీఆర్ విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎక్కుడున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. గద్వాల, నారాయణపేటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. గద్వాల సభలో ఆయన మాట్లాడుతూ.. గద్వాలను గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రపంచంలో ఉండే అష్టాదశ శక్తి పీఠాల్లో మన జోగులాంబ తల్లి దేవాలయం ఓ శక్తిపీఠం. అందుకే జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లా అని పేరుపెట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు. జిల్లా పేరు అనుకున్నప్పుడుల్లా అమ్మవారిని స్మరించుకున్నట్లు అవుతుందని ఆ పేరు పెట్టుకున్నామన్నారు. గద్వాల చరిత్ర చాలా గొప్పది. ఈ గద్వాల ఊరుపేరే బయటి ప్రపంచంలో మాట్లాడితే విద్వత్‌ గద్వాల అని మాట్లాడేది. ప్రసిద్ధిగాంచిన తిరుపతి వెంకటకవులను ఈ సంస్థానంలో సన్మానించిన ఘనత చరిత్ర ఉన్నది గద్వాల. ఇంత వరకు బాగేనే ఉంది. గద్వాలను గబ్బుపట్టించిన గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు? సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

KCR hits out at congress and BJP in Gadwal and Narayanpet public meetings

కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని దశాబ్దాలు పరిపాలించిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రంతా మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలన ఎలా ఉందో.. ఈ పార్టీ ఎందుకు పుట్టిందో మీకు తెలుసు. రెండు విషయాలను చూద్దాం. కృష్ణా, తుంగభద్ర ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండా ఆగం చేసి కరువు పాలు చేసిన పార్టీ ఏదీ ? దయచేసి చరిత్రను చూడాలి' అని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు కేసీఆర్.

తెలంగాణపై పెత్తనం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్‌ ఆరాటమని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 'బీజేపీ నుంచి నోరుపెట్టుకొని వస్తున్నరు. 157 మెడికల్‌ కాలేలు దేశంలో కడితే.. మనకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇయ్యలే. చట్టం ఉన్నది. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. నేను నూరు ఉత్తరాలు రాసిన నరేంద్ర మోదీకి. ఒక్క పాఠశాల కూడా ఇయ్యలే. మాకు వస్తే గద్వాలకు నవోదయ పాఠశాల వస్తుండే. ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వనటువంటి బీజేపీకి పార్టీకి ఓటు ఎందుకు వేయాలి' అంటూ ప్రశ్నించారు కేసీఆర్.

'అందుకే నేను మిమ్మల్ని కోరేది. ఎలక్షన్లలో ఆగమాగం ఓటువేయొద్దు. వ్యక్తి చరిత్ర, వాళ్ల పార్టీ చరిత్ర, నడకవడిక, ప్రజలు గురించి ఎలా ఆలోచిస్తరని ఆలోచించి ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు. మీరు గెలవాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ కాంగ్రెస్‌ రెండుమాటలు చెబుతున్నది. రైతుబంధు అవసరం లేదు.. దుబార చేస్తున్నడు కేసీఆర్‌ అని మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షులవారేమో కేసీఆర్‌ బేకార్‌గా వేస్ట్‌ చేస్తున్నడు. రైతులకు మూడుగంటల కరెంటు చాలు. మొత్తం దుబారా చేస్తున్నడు అని మాట్లాడుతున్నరు. కరెంటు కరెంటు మూడు గంటలు చాలా? 24 గంటలు కావాల్నా..? రైతుబంధు దుబారనట? నేను దుబార చేస్తున్ననట. నేను కాపోడినే. నాకు వ్యవసాయం ఉన్నది' అన్నారు కేసీఆర్. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామనేవారినే బంగాళాఖాతంలో వేయాలన్నారు.

మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారు. ఆంధ్రాలో ఎస్టీల్లో పెట్టి.. ఇక్కడ బీసీల్లో చేర్చి అన్యాయం చేశారు. ఆనాడు వాల్మీకి, బోయలను ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే. ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ విమర్శించారు.

'మనం గొడగొడ ఏడుసుకుంట వలసపోయిన నాడు ఒక్క కాంగ్రెస్‌, బీజేపోడు ఎవడన్నా జై తెలంగాణ అన్నడా? మన చెవులతో విన్నామా? మనం జై తెలంగాణ అంటే.. మనల్నే జైళ్లో వేశారు. చంపారు, కొట్టారు. లాఠీచార్జీలు చేసి అనేక కేసులు పెట్టారు. వాళ్లు ఎన్నడూ అనలే. వాళ్లకు ఎందుకు కడుపునొప్పి ఉంటది ? తెలంగాణపై మళ్లీ పెత్తనం కావాలి? పచ్చపడ్డది కదా? మళ్ల కరగనాకాలి ఇగ.. ఏం లేకుంట మళ్లీ ప్రజలకు గుండుకొట్టాలి. దాని కోసమే వాళ్ల ఆరాటం తప్ప.. తెలంగాణ బతుకుల కోసం కాదు. తెలంగాణ పోరాటం కోసం కాదు. ఏమాత్రం పొరపాటు చేసినా వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లయితది. మళ్లీ మొదటికే వస్తం. చాలా ఇబ్బందులు వస్తయ్‌. దయచేసి ఆలోచించి గద్వాల అభివృద్ధి కోసం అనుక్షణం తపించే వ్యక్తి కృష్ణమోహన్‌రెడ్డి. మంచి పట్టున్న నాయకుడు. ఆయనను గతంలో కంటే పదివేల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించాలి' అని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు.

నారాయణ పేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ మంచి కార్య‌క్ర‌మాలు చేసి ఉంటే.. ద‌ళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగా వాడుకుంద‌ని సీఎం మండిప‌డ్డారు. నారాయ‌ణ‌పేట‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. తెలంగాణ‌లో హైద‌రాబాద్ మున్సిపాలిటీ త‌ర్వాత రెండో మున్సిపాలిటీగా ఏర్ప‌డింది నారాయ‌ణ‌పేట‌. ఆ త‌ర్వాత రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలు ఏర్ప‌డ్డాయన్నారు.

నారాయ‌ణ‌పేట‌ను జిల్లా చేస్తే చాలు.. ఏం అడ‌గన‌ని రాజేంద‌ర్ రెడ్డి చెప్పి చేయించుకున్నారు. ఆ త‌ర్వాత మెడిక‌ల్, న‌ర్సింగ్, అగ్రిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మందిలా నిల‌బెట్టి.. చేస్త‌వ‌.. చ‌స్త‌వా ప్ర‌జ‌ల ముందు చెప్పాల‌ని డిమాండ్ పెట్టిండు. అంటే దొడ్ల‌కు వ‌చ్చిన గోధ పెండ పెట్ట‌కుండా యాడికి పోత‌ద‌ది. ఉపాయం, హుషారు ఉన్న వ్య‌క్తి రాజేంద‌ర్ రెడ్డి. ఆయ‌న కోరిన కోరిక‌ల‌న్నింటిని ఎన్నిక‌లు అయిపోగానే అమ‌లు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+