పద్మ పవర్ ఏందో చూశారుగా..: కాంగ్రెస్ మన కళ్లతోనే పొడవాలని చూస్తోందంటూ కేసీఆర్ ఫైర్
మెదక్: ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ప్రజల చేతిలో ఉన్న విలువైన ఆయుధం ఓటు అని అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తలరాతను మార్చే ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో కరెంట్, సాగునీరు, తాగునీరు లేదని.. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు.
సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని కేసీఆర్ అన్నారు. ప్రజల డబ్బును రైతుబంధు రూపంలో వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి అన్నారని ధ్వజమెత్తారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే.. ధరణి తీసేస్తామని చెప్తున్నారని అన్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు వస్తున్నాయని పేర్కొన్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయని వివరించారు.

ఇక, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది పద్మా దేవేందర్ రెడ్డి పవర్ అని కేసీఆర్ అన్నారు. రామాయంపేట ప్రజలు.. పద్మా దేవేందర్ రెడ్డి పవర్ ఏందో చూశారు కాదా..? ఆర్డీవో ఆఫీసు వచ్చిందా..? హరీశ్‌రావు ప్రారంభించిండా..? డిగ్రీ కాలేజీ వచ్చిందా..? ఇవన్నీ వచ్చాయి.. పద్మాదేవేందర్ రెడ్డి నా బిడ్డ అని ఉట్టిగా చెప్పలేదు. ఆమె అనుకుంటే పనులు ఎలా అవుతున్నాయో మీరు చూస్తున్నారు అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
పొద్దున్నుంచి రాత్రి వరకు మీ మధ్యలో ఉండే పద్మ గెలిస్తే.. మీ కోసం పని చేస్తుంది. రింగ్ రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీ ఆటోమేటిక్‌గా నడుచుకుంటూ వస్తాయి. ఆ అవకాశం పొగొట్టుకుంటే చాలా ప్రమాదం అయితది. మళ్లీ తెలంగాణ ఇబ్బందుల పాలవుతది. సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ. సంపద పెంచలేదు.. మనల్ని సర్వనాశనం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్లా ఇప్పుడు వచ్చి తమాషాలు చెబుతున్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి, ఆ కాంగ్రెస్‌ల నిలవడ్డొనికి ఏమన్నా పోలిక ఉందా..? ఏదో దిష్టిబొమ్మను తీసుకొచ్చి పద్మ ఎదురుగా పెడితే.. ఆయన గెలవాలి. మనం ఓడిపోవాల్నా..? పద్మా దేవేందర్ రెడ్డి గెలవాలి. వంద శాతం గెలిపించండి. మీ తరపున ఆమె కోరిన కోరికలను తీర్చే బాద్యత నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications