Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్: ఓటమితోనే ఆగిన.. లేదంటే సగం దేశంలో మంటే!

కరీంనగర్: భూమి, ఆకాశం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ కదనభేరీతో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ సర్కారు కరెంట్‌, రైతుబంధు ఇవ్వలేకపోతోందని విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు బోగస్‌ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించుకోవాలన్నారు కేసీఆర్. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నా.. పాలకులకు దయరావట్లేదని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. మూడు నెలల్లోనే పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేరశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిస్తోందన్నారు.

kcr hits out at revanth reddy and modi in karimnagar public meeting

ఆశకు పోయి కాంగ్రెస్‌ను గెలిపిస్తే గ్యారంటీల అమలు వదిలి దిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని విమర్శించారు. అహోరాత్రులు కష్టపడి ఇంటింటికి మిషన్‌ భగీరథ నీళ్లు, రెప్పపాటు పోకుండా కరెంట్‌ ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్‌, నీళ్లు ఇవ్వకపోయినా మద్దతిచ్చినట్లువుతుందని హెచ్చరించారు. కొందరు పార్టీ మారగానే బీఆర్​ఎస్​ పనైపోయిందనే ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్.. భూమి ఆకాశాలు ఉన్నంతకాలం పార్టీ ఉంటుందని వివరించారు. కాంగ్రెస్‌ సర్కారు కరెంట్‌, రైతుబంధు ఇవ్వలేకపోతోందని కేసీఆర్‌ విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్​ విమర్శించారు. 'కాళేశ్వరం ప్రాజెక్ట్‌​లోని మేడిగడ్డ బ్యారేజ్​ వంద కాంపోనెంట్లలో అదొక చిన్న పిల్లర్. దానికింద ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగాయి. ఎంతసేపు కేసీఆర్​‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు కానీ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించటంలేదు. ఇంకా వాటిపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్ప రైతుల వ్యథను పట్టించుకోవటం లేదు' అని కేసీఆర్.. రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

తాను అధికారం దిగిపోగానే రాష్ట్రంలో కరెంట్‌, రైతు బంధు బంద్‌ అయ్యాయన్నారు కేసీఆర్. పోలీసులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన కేసీఆర్​.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దని, మేం అలా చేస్తే కాంగ్రెసోళ్లు మిగిలేవారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక పన్ను వదులైతే మొత్తం రాలగొట్టుకుంటామా. ప్రశ్నించారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీలోకి వచ్చి, కాళేశ్వరంపై వివరిస్తానని కేసీఆర్ చెప్పారు.

సీఎం రేవంత్​ రెడ్డిని ఆరు గ్యారంటీలు అడిగితే..చెప్పులతో కొడతా.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబు అవుతా అంటున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తానూ పరుషంగా మాట్లాడాననీ.. కానీ, సీఎం అయిన తర్వాత అలా మాట్లాడలేదని తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆగిపోయానని.. లేదంటే సగం దేశంలో మంట రగిల్చేవాడనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజా తీర్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

తమాషాకు ఓటేయొద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్‌ నేతలు బోగస్‌ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ, కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్​ఎస్‌​ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌ను గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+