Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: మధును గెలిపించుకోవాలంటూ కేసీఆర్ పిలుపు

మంథని: తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంథని నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

కాంగ్రెస్‌ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు కేసీఆర్. 'దేశంలో రైతుల గురించి గానీ, దళిత బిడ్డల గురించి గానీ, గిరిజన ఆదివాసీల గురించి గానీ కాంగ్రెస్‌ పార్టీ సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే ఇవాళ దేశం ఇట్ల ఎందుకుంటుండె..? ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుండె..? ఇది మీరొకసారి ఆలోచించాలె. మన కంటే వెనుకకు స్వాతంత్య్రం వచ్చిన చైనా కూడా ఎంతో ముందుకు దూసుకుపోయి అమెరికాతో పోటీ పడుతున్నది. మరె మనకు ఈ గతి ఎందుకు..? ఇవి ఆలోచించకుండా గుడ్డిగ ఓటేస్తే మంచి ఫలితం రాదు. దెబ్బతింటం. అందుకే ఆలోచించకుండా, బాధ్యత లేకుండా ఓటు వేయొద్దని నేను కోరుతున్నా' అని కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

KCR hits out congress party in manthani brs public meeting

బీఆర్ఎస్ పార్టీకి హైక‌మాండ్ ఢిల్లీలో ఉండ‌దు. మ‌న బాసులు తెలంగాణ ప్ర‌జ‌లే. ప్ర‌జ‌లు ఏది కోరితే అదే జ‌రుగుత‌ది. మ‌న నిర్ణ‌యాలు ఇక్క‌డే జ‌రుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్క‌డ‌ లైట్లు వెలుగుతాయి. ఇవ‌న్నీ వ‌ట్టి పోసిగాళ్లే. టికెట్ల కోసం ఆఫీసులు కాల‌బెట్టుకుంటున్నారు. అలా లేదు మ‌న ద‌గ్గ‌ర‌. అంద‌ర్నీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతున్నాం. వారికి డ‌జ‌న్ మంది సీఎంలు. ఏడాదికి ఎంత మంది మారుత‌రో తెలియ‌దు.. కర్ణాట‌క‌లో ఏం జ‌రుగుతుందో చూస్తున్నాం. ఒక నిశ్చిత‌మైన అభిప్రాయం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, రాష్ట్రానికో నీతి పెట్టారు అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

'మంథనిలో పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగ్‌ రోడ్డును ఎవరూ పూర్తి చేయలే. పుట్ట మధు వచ్చినంకనే నా వెంటపడి దాన్ని పూర్తి చేసిండు. అనేక గ్రామాలకు రోడ్లు లేకుండె. నదుల మీద బ్రిడ్జిలు లేకుండె. నా వెంటపడి కొన్ని వందల కిలోమీటర్లకు రోడ్లు వేయించిండు. పలిమెల, పంకెన లాంటి మారూమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించిన ఘనత పుట్ట మధుది. ఆయన ఎంత చేయాల్నో అంత చేసిండు. కానీ, మీరే ఆయన పని చేసిండ్రు. నిజమా.. కాదా..?' అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించడంపై సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

KCR hits out congress party in manthani brs public meeting

మరోవైపు, బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదని.. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంథని ఎమ్మెల్యేగా బీసీ బిడ్డ పుట్ట మధును గెలిపించాలని ప్రజలను కోరారు. 'బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదు. మంథనిలో ఉన్న ప్రతి ఒక్క బీసీతో మాట్లాడుతన్న. రానికాడ టికెట్‌ రాకపాయే.. వచ్చిన కాడ చైతన్యం ఏమైతున్నట్టు.. ? నేను మంథనిలో బీసీ బిడ్డలతో పంచాయితే పెట్టుకుంట నేను చెబుతున్నారు. ఇవాళ నేను వెళ్లిన తర్వాత ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి బలహీన వర్గాల ఇంట్లో చర్చ జరగాలి' అని కేసీఆర్ సూచించారు.

'బీసీ నాయకుడు.. బలంగా ఎదిగి వచ్చి పని చేస్తుంటే.. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలి ? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. అవకాశం వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది ? నేను మీ అందరికీ అప్పీల్‌ చేస్తున్నా. ఎవరైతే బీసీ ఉద్యోగస్తులున్నరో.. బీసీ విద్యార్థులున్నరో.. బీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ ఉన్నరో దయచేసి మీ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో చూపించాలి. పుట్ట మధు గత ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వెంటనే వచ్చిన అవకాశంతో జడ్పీ చైర్మన్‌ను చేసుకున్నాం. నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా. ఇది వెనుకబడిన ప్రాంతం. ఎలక్షన్లు కాంగనే అవతలపడేటోళ్లు కాదు. పుట్ట మధులాగా ప్రజల మధ్యనే ఉండెటోళ్లు కావాలే మనకు' సీఎం కేసీఆర్‌ ప్రజలకు స్పష్టం చేశారు.

'హైదరాబాద్‌లో కుసున్నోళ్లకు ఓటు వేస్తే ఏమైతది ? ఫలితం ఏం వస్తుంది ? పోయి కలుసుడే. భ్రమలోపడి, వెర్రిలోపడి అలాంటివారికి ఓటువేస్తే రాదు.. ఇక్కడే ప్రజల్లో ఉండి ముండికి మన్నంటంగ తిరిగినోడే సిపాయి. వాళ్లు గెలిస్తేనే మనం బాగుపడుతాం తప్ప.. స్టయిల్‌గా వచ్చి చేతులు ఊపి మాట్లాడేవారితో కాదు. అందువల్ల నేను మీ అందరికీ కోరుతున్నా. బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు చైతన్యం చూపించి చూపించాలి. పుట్ట మధును తప్పకుండా ఈ సారి గెలిపించాలి. మంథనిలో ఒకరోజంతా మీతోనే ఉంటా' అని కేసీఆర్ ఓటర్లకు భరోసా ఇచ్చారు.

'మంథని టౌన్‌లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా రూ.1000కోట్లు మంజూరు చేసి మంథని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీ దరిద్రం పోగెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. మీకు ఏం అవసరాలున్నాయో మధుకు తెలుసు. ఆ రోజు నేనుకూడా ఉంటా. అన్ని మండలాల నాయకులను పిలుచుకొని.. ఆఫీసర్లను కూర్చుండబెట్టుకుందాం. మీకు ఏం ఏం చావాలో చేసి పెట్టే బాధ్యత నాది. నా మాటగా ప్రజలకు గ్రామగ్రామాల్లో అని బీఆర్‌ఎస్‌ లీడర్లు, కార్యకర్తలను కోరుతున్నా. ప్రత్యేకమైన నిధిని వెనుకబడ్డ మంథని నియోజవర్గానికి ఇస్తాం. తప్పకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధికి సహకరిస్తా. మధు ఆధ్వర్యంలో ఆ పనులన్నీ చేసుకోవాలని సూచిస్తున్నా' అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

KCR hits out congress party in manthani brs public meeting

మీ మ‌ధ్య‌లో ఉండే మ‌ధును గెలిపించాలి. పుట్ట మ‌ధు అదైర్య ప‌డుతున్నారు. కొంత మందిని కొనుక్కుపోతున్నారని. వారి మీద ఊర్లో రియ‌క్ష‌న్ వ‌స్త‌ది. నువ్వేం చితించే ప‌ని లేదు. కొన్నోడు, అమ్ముడు పోయినోడు ఎవ‌రో తెలిసిపోత‌ది. నేను క‌రీంనగర్ ఎల‌క్ష‌న్ల ఉన్న‌ప్పుడు అట్ల‌నే చేశారు. చొప్ప‌దండి నియోజ‌క‌ర‌వ్గంలో ఐదుగురు పార్టీ మండ‌ల అధ్య‌క్షుల‌ను కొనేశారు. ఆ ఊర్ల‌లో వారిని దంచిండ్రు.. ఐదు ఓట్లు కూడా రాలేదు. ఇక్క‌డ కూడా అదే జ‌రుగుత‌ది. నీవేం రందీప‌డ‌కు ప్ర‌జ‌ల‌కు చైత‌న్యం ఉంది. ఆ పైస‌ల కోసం మోస‌పోయేటోళ్లు కాదు ప్ర‌జ‌లు అని కేసీఆర్ చెప్పారు.

కొంత‌మంది పిచ్చి నాయ‌కులు గొర్రెల్లాగా పోవొచ్చు కానీ.. ప్ర‌జ‌ల‌కు అది లేదు. పోయిన సారి జ‌రిగిన న‌ష్టం తెలిసింది. నూరు క‌థ‌ల ప‌డ్డా.. ప్ర‌జ‌ల మ‌న‌సులో ఏముందంటే గ్యారెంటీగా బీఆర్ఎస్ స‌ర్కార్ వ‌స్త‌ది అందులో అనుమానం లేదు. అలాంట‌ప్పుడు మ‌ధు ఉంటే లాభ‌మైత‌ది.. వేరే ఆయ‌న ఉంటే లాభ‌మైత‌దా..? గ‌వ‌ర్న‌మెంట్ ఉన్న ఎమ్మెల్యేనే రావాలి.. అప్పుడే లాభం జ‌రుగుత‌ది. మంథ‌ని ఎమ్మెల్యేగా మ‌ధు గెలిస్తేనే మీకు లాభం జ‌రుగుతుంది. ఎక్క‌డికి పోయినా ప‌ని చేసుకొచ్చే సామ‌ర్థ్యం మధుకు ఉంద‌న్నారు కేసీఆర్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+