కేసీఆర్ మునుగోడులో దొంగ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారు.!కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపి నేతల ఫిర్యాదు.!

ఢిల్లీ/హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను మునుగోడులో నమోదు చేసిందని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపి ముఖ్య నేతలు ఫిర్యదు చేసారు.ఈ సందర్బంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ రావు మాట్లాడారు. గతంలో ఉప ఎన్నికల్లో 2000 ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదని, కానీ ఈ ఉప ఎన్నికల్లో భారీగా నకిలీ ఓటర్లను నమోదు చేశారని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

నకిలీ ఓటర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామని, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోహరించారని, ఇది అప్రజాస్వామికమని తరుణ్ చుగ్ వివరించారు. గత నాలుగేళ్ల నుంచి పోలీసులు రెవెన్యూ అధికారులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారని, వారిని వెంటనే బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. మంత్రులు సెక్రెటరీలని తీసుకువచ్చి అక్కడినుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, అధికారులు సామాన్యులను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు.

KCR is encouraging Fake voters in Munugodu.BJP leaders Complaint to the CEC

తప్పకుండా ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారని తరుణ్ చుగ్ వివరించారు. కేంద్ర బలగాలను, ఎన్నికల పరిశీలకులను మునుగోడు పంపాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సచివాలయాన్ని మునుగోడుకు తరలించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మునుగోడులో పెట్టారని, పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని చంద్రశేఖర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.

KCR is encouraging Fake voters in Munugodu.BJP leaders Complaint to the CEC

మునుగోడులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా తెలంగాణ హైకోర్టులో ఇదే ఓటర్ల అంశానికి సంబంధిచి తెలంగాణ రాష్ట్ర బీజేపి పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పిటీషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. మొత్తానికి మునుగోడు ఉప్ప ఎన్నికతో పాటు మునుగోడు ఓటర్ల అంశం కూడా సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+