The Dragon and The Elephant: కేసీఆర్‌కు ఇష్టమైన సబ్జెక్ట్ అదే..!!
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటోన్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లడం వల్ల శస్త్ర చికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నారు.
కేసీఆర్ పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తోన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. కేసీఆర్‌ను పరామర్శించారు.

తాజాగా- అక్కినేని నాగార్జున కేసీఆర్‌ను పరామర్వించారు. కొద్దిసేపటి కిందటే యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయనతో కలిసి నేరుగా కేసీఆర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న గదికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్‌కు అందిస్తోన్న ట్రీట్‌మెంట్‌పై నాగార్జునకు వివరించారు డాక్టర్లు. తుంటి ఎముక రీప్లేస్ చేశామని, ఇప్పుడిప్పుడే వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్‌తో రోజూ కొన్ని నిమిషాల పాటు వాకర్ సహాయంతో నడిపిస్తోన్నారు డాక్టర్లు. ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్‌తో ట్రీట్‌మెంట్ ఇస్తోన్నారు.
కాగా- ఖాళీ సమయంలో కేసీఆర్ పుస్తకాలను చదువుతున్నారు. ప్రత్యేకించి- భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని బుక్స్‌ను తెప్పించుకున్నారు. వాటిపై అధ్యయనం చేస్తోన్నారు. ప్రఖ్యాత ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్ సినాప్సిస్‌ను కేసీఆర్ చదవటం కనిపించింది.
భారత్- చైనా ఆర్థిక వ్యవస్థపై రచించిన బుక్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్. బ్రిటీష్ ఎకనమిస్ట్ డేవిడ్ హెన్రీ స్మిత్ దీన్ని రాశారు. ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక తేడాలను వివరించారు. ఈ బుక్‌కు సంబంధించిన కొంత సినాప్సిస్‌ను తెప్పించుకున్నారు కేసీఆర్. వాటిపై సమగ్రంగా అధ్యయనం చేశారు.












Click it and Unblock the Notifications