Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆరే అసలు దోషి.!వ్యాట్ తగ్గించినా వెయిటింగ్ ఏంటి..?నిలదీసిన బండి సంజయ్.!

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు పై 5రూపాయలు, డీజిల్ పై 10 పది రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశంలోని 17 రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్ పై ఇప్పటికే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయని బండి సంజయ్ గుర్తు చేసారు

17 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపు.. కేసీఆర్ కు మాత్రం మనసు రావడంలేదన్న సంజయ్

17 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపు.. కేసీఆర్ కు మాత్రం మనసు రావడంలేదన్న సంజయ్

ఉత్తర ప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ పై ఏకంగా 12రూపాయలు, డీజిల్ పై 12 రూపాయలను తగ్గిస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుని ప్రజలకు ఊరట కలిగించిందని, త్రిపుర, సిక్కిం, కర్నాటక, హర్యానా, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, పుదుచ్చేరి, అసోం, గుజరాత్, మణిపుర్ రాష్ట్రాలు లీటర్ పెట్రోల్ పై 7రూపాయలు, డీజిల్ పై కూడా 7రూపాయలు తగ్గించాయని బండి సంజయ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు సైతం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను రూపాయి నుండి 5 రూపాయల వరకు తగ్గించాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమని సంజయ్ మండిపడ్డారు.

 యూపీ తరహాలో పెట్రోలు, డీజిల్ పైనా వ్యాట్ తగ్గించాల్సిందే.. సహించేది లేదన్న బండి

యూపీ తరహాలో పెట్రోలు, డీజిల్ పైనా వ్యాట్ తగ్గించాల్సిందే.. సహించేది లేదన్న బండి

హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిరోజూ టీఆర్ఎస్ నాయకులు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై దుష్ర్పచారం చేశారని, కేంద్రాన్ని దోషిగా చూపుతూ రాజకీయ లబ్ది పొందాలని చూసినా హుజూరాబాద్ ప్రజలు విజ్ఝతతో వ్యవహరించి బీజేపీ పక్షాన నిలిచారని సంజయ్ అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీఆర్ఎస్ నాయకులు ఇంకా హుజూరాబాద్ ఓటమి నుండి కోలుకోనట్లుందని సంజయ్ ఎద్దేవా చేసారు. ప్రజలు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అల్లాడుతున్నా కనీసం పట్టించుకోవాలనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో అసలు దోషి రాష్ట్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. తక్షణమే పెట్రోలు, డీజిల్ పై రాష్ట్రం విధిస్తున్న పన్ను తగ్గించాలని తెలంగాణ బీజేపీ శాఖ డిమాండ్ చేస్తోందని బండి జంజయ్ అన్నారు.

 ఎందుకు మొద్దు నిద్ర.. కేసీఆర్ ఫాం హౌస్ నుండి బయటకు రావాలన్న కాషాయ దళపతి..

ఎందుకు మొద్దు నిద్ర.. కేసీఆర్ ఫాం హౌస్ నుండి బయటకు రావాలన్న కాషాయ దళపతి..

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తే ప్రజలకు తక్కువ ధరకే పెట్రోలు, డీజిల్ ధరలు అందుబాటులోకి వస్తాయని, ఆర్టీసీ సంస్థ సైతం డీజిల్ పై స్టేట్ వ్యాట్ ను తగ్గించుకోవాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోందని, స్టేట్ వ్యాట్ తగ్గిస్తే ప్రజా రవాణా మరింత చౌకగా అందుబాటులోకి వస్తుందని, అయినప్పటికీ చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, వ్యాట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకుంటోందని బండి సంజయ్ మండిపడ్డారు.
ఇప్పటికే ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేని దుస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేసారు.

Recommended Video

    Fuel Prices Drop : AP & TS ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ₹100 లోపుకు చమురు ధరలు!! || Oneindia Telugu
     ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. కేసీఆర్ ను హెచ్చరించిన కమలం బాస్

    ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. కేసీఆర్ ను హెచ్చరించిన కమలం బాస్

    రాష్ట్ర ప్రజలు వాస్తవాలను అర్ధం చేసుకుంటున్నరని, అధికార టీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెడుతున్నరని, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజా తీర్పే ఇందుకు నిదర్శనమని బీజేపి అధ్యక్షుడు సంజయ్ స్పష్టం చేసారు. ఇకనైనా చంద్రశేఖర్ రావు ప్రభుత్వం వాస్తవాలను గ్రహించాలని, లేనిపక్షంలో ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చురకలంటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా యూపీ తరహాలో తక్షణమే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని, అదే విధంగా టీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా బీజేపీపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+