స్వార్థ రాజకీయాలను భస్మం చేసే సూర్యుడు కేసీఆర్.!మంత్రి గంగుల అనూహ్య స్పందన.!
కరీంనగర్/హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థుల జయకేతనం ఎగరేసారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేసారు. టిఆర్ఎస్ ఓటర్లంతా ఐకమత్యం చాటారని, ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థికి బిజెపి ప్రజాప్రతినిదులు ఓట్లు వేసారా అని ప్రశ్నించారు. బీజెపి ఓట్లు చీలితే అందుకు బాధ్యత బండి సంజయ్ తీసుకుంటారీ లే ఈటెల రాజేందర్ తీసుకుంటారా అని గంగుల కమలాకర్ నిలదీసారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంత్రి గంగుల కమాలాకర్ మాట్లాడుతూ బీజేపి పైన నిప్పులు చెరిగారు. జిల్లాలో కొంతమంది శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, ఆ శిఖండీలను భగ భగ మంటల్లో కాల్చి వేసే తేజోమయ సూర్యుడు చంద్రశేఖర్ రావని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కుని కరీంనగర్లో వినియోగించుకున్నారు గంగుల కమలాకర్.

స్థానిక సంస్థల్లో తమకు బలం లేదని కాంగ్రెస్, బిజెపిలు పోటీ నుంచి తప్పుకున్నాయని, సంపూర్ణ మెజారిటీ టిఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టే ఏకగ్రీవానికి ప్రయత్నం చేశామని, కానీ కొందరు కడుపుమంట కలిగిన వ్యక్తులు స్వార్థంతో పోటీలో అభ్యర్ధులను పోటీలో నిలిపారని దుయ్యబట్టారు మంత్రి గంగుల కమలాకర్. పచ్చని పార్టీలో చిచ్చుపెట్టే కుట్రలు భగ్నం అయ్యాయన్నారు. స్థానిక ఎన్నిక ఏకపక్షమే అన్నారు.

క్రమశిక్షణకు మారుపేరైన టిఆర్ఎస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగించింది అన్నారు. జిల్లాలోని 1324 ఓట్లలో 986 కు పైగా టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినవేనని, ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్ కే పడ్డాయన్నారు. బీజేపీకి ఉన్న సభ్యుల ఓట్లు వారికే పడ్డాయా? లేదా? ఒక వేల తగ్గితే ఆ బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుంటారా? లేదా ఈటల రాజేందర్ తీసుకుంటారా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. తమ పార్టీ సభ్యులంతా ఐకమత్యంగా ఏకతాటిపై ఉన్నారని, అలాగే బిజెపి సభ్యులు ఉన్నారా లేదా చెప్పాలన్నారు మంత్రి గంగుల.












Click it and Unblock the Notifications