తెలంగాణకు కేసీఆర్ అరిష్టం.!ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ ఓటమి తథ్యమన్న ఈటల.!
హైదరాబాద్ : గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో హుజూరాబాద్ వంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియంతృత్వంతో స్వేచ్ఛను హరించాడని,స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టాడని బీజేపి ఎమ్మెల్యే ఆటల రాజేందర్ మండిపడ్డరు. అందుకే అక్కడ ప్రజలు నిశ్శబ్దంగా ఉటూ అవకాశం వచ్చినపుడు సత్తా చూపించారని అన్నారు. ఓటు శక్తి చూపించారని, చంద్రశేఖర్ రావు కోరలు పీకారని, చెంప చెళ్లుమనిపించారని, చరిత్ర నిర్మాతలు ప్రజలే అని నిరూపించారన్నారు ఈటల. హుజూరాబాద్ దేశానికి, రాష్ట్రానికి దిక్షూచిగా స్పూర్తిని నింపిందని, ఒక నాడు నాయకుడు అంటే త్యాగమని, వారికోసం త్యాగం చేసే అభిమానులు ఉండే వారని, కానీ ఈ రోజు నాయుకుడు అంటే వ్యాపారం అనే భావనకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈటల ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజాస్వామ్యానికే అరిష్టం అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రశేఖర్ రావు ఓటమి తధ్యమని ఈటల స్పష్టం చేసారు.

కాంగ్రెస్ కి ఓటు వేస్తే వాళ్లు మళ్లీ గులాబీ పార్టీలోకి వెళ్తున్నారని, యాంటి డిఫెక్షన్ లా ను అపహాస్యం చేసిన వాడు చంద్రశేఖర్ రావు అని, అప్పుడు టీడీపీనీ, ఇప్పుడు 119 లో 90 మంది గెలిచినా కూడా కాంగ్రెస్ ను విలీనం చేసుకున్నాడని మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? నమ్మకాన్ని అమ్ముకుంటున్నారా అని ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో బీజేపికి మంచి అవకాశం ఉందని, పార్టీ మారిన నాయకులందరినీ వెనక్కు పిలవాలని ఈటల సూచించారు. టీఆర్ఎస్ పార్టీని నిలువరించి, బొందపెట్టే పార్టీ బీజేపీ మాత్రమేనని, మోదీ పీఎం అయ్యాక దేశం దూసుకుపోతుందని ఈటల తెలిపారు. కేంద్రంలో కనుచూపు మేర వేరే పార్టీ పోటీలో లేదని, తెలంగాణలో చేతకాని వాడు, ఢిల్లీలో చక్రం తిప్పుతా అని ప్రగల్బాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేసారు ఈటల. రైతు చట్టాలు వెనక్కు తీసుకొని ప్రధానమంత్రి జెంటిల్మెన్ గా వ్యవహరించాడని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications