హైద్రాబాద్‌పై కేసీఆర్ మాస్టర్ ప్లాన్, మాటిచ్చి చేశారు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, పరిశుభ్రత, మొక్కలు నాటడంతోపాటు రాజధానిలో పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుని అమలుకు చర్యలు చేపట్టారు. ఒకవైపు రాజకీయ ప్రయోజనం, హైదరాబాద్‌లో అభివృద్ధి - పరిశుభత్ర - పచ్చదనాన్ని మిళితం చేస్తూ ప్రణాళికను రూపొందించుకున్నారంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉన్నాయి. డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కోసం కసరత్తు సాగుతోంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉంది. గ్రేటర్‌ను 330 విభాగాలుగా గుర్తిస్తూ, ఆయా విభాగాల్లో అభివృద్ధి కోసం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు ఆదివారం మమతా నగర్ కాలనీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేసీఆర్ ప్రకటించారు.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా చేపట్టారు. ఒకవైపు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతోపాటు మరోవైపు రాజకీయంగా తెరాస పట్టుసాధించే విధంగా ప్రణాళికను రూపొందించారు. 330 విభాగాల బాధ్యతలు చేపట్టిన మంత్రులు, అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభత్ర వంటి వాటిపై దృష్టిసారిస్తారు.

KCR keeps his promise, pays visit to Mamatanagar

ఇచ్చిన మాట ప్రకారం మమతానగర్ కాలనీలో రతచిఆకద మరోసారి పర్యటించి అధికారులను, స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఇంజనీర్ ఇంట్లో వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ గత నెలలో నాగోల్ వెళ్లారు. ఆ సమయంలో దారిలో మమత కాలనీలో అపరిశుభ్రమైన వాతావరణం చూసి ఆగి స్థానికులతో మాట్లాడారు. మున్సిపాలిటీ వాళ్లు పట్టించుకోరని, దొంగల బెడద ఎక్కువగా ఉందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

దాంతో ముఖ్యమంత్రి నగర పోలీసు కమిషనర్‌ను పిలిపించారు. మళ్లీ వారం రోజుల తర్వాత వస్తాను, ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రెండు వారాలు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి ఆదివారం మళ్లీ మమతానగర్ కాలనీకి వెళ్లి స్థానికులతో ముచ్చటించారు.

తన తొలి పర్యటనలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ రెండవ పర్యటన నాటికి అమలులోకి వచ్చేశాయి. కాలనీలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. చెత్త వేయడానికి డబ్బాలు ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి చెత్త తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. దాంతో కాలనీవాసుల ఆనందానికి అంతు లేకుండాపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+