చంద్రబాబు సాయానికి కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నాలు ? కానీ.. సీపీఐ నారాయణ కామెంట్స్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియబోతోంది. ఎల్లుండి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాష్ట్రంలో ఎన్నికలు సాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ కు మద్దతుగా ఎంఐఎం, కాంగ్రెస్ కు మద్దతుగా మిగతా పార్టీలు నిలుస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ లో భారీ సంఖ్యలో ఉన్న సెటిలర్లు చంద్రబాబు అరెస్టు తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు రివర్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బయటపడేందుకు సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ చంద్రబాబు సాయం కోసం ప్రయత్నిస్తున్నాని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ కేసీఆర్ ఓటమిని గ్రహించే చంద్రబాబు ఆయన్ను కలవడం లేదని నారాయణ చెప్పుకొచ్చారు. దీంతో నారాయణ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాబు మద్దతు కోసం ప్రయత్నాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ ఎన్నికల్లో మిగతా వాళ్లకు సన్ స్ట్రోక్ తగులుతుంటే కేసీఆర్ కు మాత్రం డాటర్ స్ట్రోక్ తగులుతోందని నారాయణ వ్యాఖ్యానించారు. యువత, మహిళలు, రైతులు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతున్నారని, ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్ కు పరిమితం అవుతారని జోస్యం చెప్పారు.
మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ దొంగలేనని నారాయణ ఆరోపించారు. కేసీఆర్ ను కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా ఎందుకు అరెస్టు చేయలేదని నారాయణ ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని,అందుకే కేసీఆర్ బయట ఉన్నాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా ఉన్నాయని, ఒక్క సీటా రెండు సీట్లా కాదని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications