Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భేష్, ఈ పద్ధతొక్కటే మారాలి: గంగదేవిపల్లి ప్రజలకి కెసిఆర్, నవ్వించారు

వరంగల్: గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమని, అయితే ఈ గ్రామంలో వ్యవసాయ పద్ధతి మారాలని, ఇందుకోసం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని మీరు సందర్శించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ గంగదేవిపల్లి గ్రామస్తులకు సూచించారు.

సోమవారం నాడు వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో కెసిఆర్ గ్రామజ్యోతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాప్రతినిధుల మీదనే ఆధారపడకుండా గంగదేవిపల్లి గ్రామస్థులు అభివృద్ధి సాధించారన్నారు. ఎవరైనా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి వైపు పయనించాలన్నారు.

గొప్ప గ్రామంలో నిలబడి ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. గంగదేవిపల్లికి ఇంకేం కావాలో గ్రామ సభ పెట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. గంగదేవిపల్లి అభివృద్ధికి తాను రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వీటిని రేపే విడుదల చేస్తానని చెప్పారు.

గంగదేవిపల్లి ఆదర్శ గ్రామాలకు చక్కటి ఉదాహరణ అన్నారు. ఈ గ్రామ ప్రజలు నియమాలు పెట్టుకొని, పద్ధతి ప్రకారం ఉండటం గర్వకారణమన్నారు. తాను చిన్నముల్కనూరు పరిస్థితి చూసి చలించిపోయానని చెప్పారు. గంగదేవిపల్లి గ్రామానికి ఈ ఊరి ప్రజలే తనను రప్పించారన్నారు.

మీలో ఐక్యమత్యం ఉంది కాబట్టి మీరు ఇంకా ఏమైనా చేయగల్గుతారన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని గంగదేవిపల్లి గ్రామస్తులు పర్యటించాలన్నారు. గంగదేవపల్లి వ్యవసాయ పద్ధతులు మాత్రం మారాలన్నారు.

పంజాబ్ గ్రామానికి అంకాపూర్ గ్రామస్తులు సీడ్స్ సప్లై చేస్తారన్నారు. గంగదేవిపల్లి పత్తి రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించాలన్నారు. మిషన్ కాకతీయ కింద గంగదేవిపల్లి కుంటను పెద్దగా చేద్దామన్నారు. గంగదేవిపల్లి స్వయం సమృద్ధ గ్రామం కావాలన్నారు.

బతుకు బాగుపడతాయని కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ బాగుపడాలన్నారు. నేను కూడా రైతునేనని కెసిఆర్ చెప్పారు. గంగదేవిపల్లికి ఏం కావాలో నేను ఇస్తానని, సాధించాల్సింది మీరే అన్నారు.

వ్యక్తులుగా మనం గొప్పవాళ్లమేనని, సంఘటితంగా విఫలమవుతున్నామన్నారు. మనలో ఉన్న గొప్ప శక్తిని మనం గుర్తుపడతలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను బయలుదేరినప్పుడు తనను తిట్టని వాళ్లు లేరన్నారు. తెలంగాణను వస్తుందా అని ఎందరో అన్నారన్నారు. కానీ వచ్చిందన్నారు.

KCR launches Grama Jyothi in Gangadevipalli

ఏదైనా ప్రారంభించినప్పుడు అలాగే ఉంటుందన్నారు. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు తాము పిడికెడు మందిమి లేమన్నారు. ఇప్పుడు తెలంగాణ సాధించామన్నారు. పట్టుబడితే ఏదీ రాకుండా ఉండదన్నారు. సమాజంలో ప్రజలు సంఘటితంగా ఉండాలన్నారు.

600 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు సాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. కాకతీయ కాలువలు అన్నీ నీరు పారేలా చేస్తానని చెప్పారు. వ్యతిరేక శక్తులు ఎక్కడైనా ఉంటాయని, వాటికి భయపడవద్దన్నారు.

కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి అని, తన తర్వాత అంతటి వ్యక్తి అన్నారు. గంగదేవిపల్లిలో గురుకుల పాఠశాలను కూడా ప్రారంభిద్దామన్నారు. హైదరాబాదులో ప్రగతి రిసార్ట్స్ ఉందని, అక్కడకు తాను ఎప్పటి నుండో వెళ్దామనుకుంటున్నానని కానీ వీలుకావడం లేదన్నారు.

అక్కడ దోమ కనిపించదన్నారు. దోమ గొప్ప సోషలిస్ట్ అని, అది ఎవరినైనా కుడుతుందన్నారు. నేను ముఖ్యమంత్రిని అని తాను కుట్టకు అంటే ఊరుకుంటుందా అన్నారు. ప్రగతి రిసార్టులో ఒక్క దోమ ఉండదన్నారు. గంగదేవిపల్లి కూడా అలా దోమలేని పల్లె కావాలన్నారు.

అక్కడున్న మొక్కల వల్ల అలా అవుతుందని, వాటిని తీసుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి ఏ విషయంలోను తీసిపోకుండా బంగారం కావాలన్నారు. గంగదేవిపల్లికి తన అండదండలు పూర్తిగా ఉంటాయని చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించాలని తాను అనుకున్నానని చెప్పారు.

గంగదేవిపల్లికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. చివరగా ఆయన జై తెలంగాణ, జై గంగదేవిపల్లి అని నినదించారు. కాగా, కెసిఆర్ సభలో గ్రామస్థులను పలుమార్లు నవ్వించారు. మంచిపని చేస్తే అడ్డుకునే వారు ఉంటారని, దోమకథ.. ఇలా పలు సందర్భాల్లో నవ్వించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+