వైష్ణవాలయం, శివాలయం: ఏపీ-తెలంగాణలపై కేసీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

పోచంపాడు: తెలంగాణకు నీళ్లివ్వాలని సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంత నేతలు ఆలోచించలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకుస్థాపన అనంతరం పోచంపాడు బహిరంగ సభలో మాట్లాడారు.

శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి కేసీఆర్ శంకుస్థాపన, రివర్స్ పంపింగ్ ప్లాన్

చివర్లో జై తెలంగాణ అని నినాదాలు చేశారు. సభికుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో.. దీంతో అంత డల్ అయ్యారేంటి అని మరోసారి జై తెలంగాణ అన్నారు.

అప్పుడే చెప్పా

అప్పుడే చెప్పా

2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జలసాధన ఉద్యమం చేశామని, అప్పుడు ప్రాజెక్టుల పరిస్థితిని తాను చెప్పానని గుర్తు చేశారు. నాటి సమైక్య పాలకులు ప్రారంభించిన ప్రాజెక్టులు మనకు నీళ్లు ఇచ్చేందుకు ప్రారంభించినవి కాదన్నారు.

అది వైష్ణవాలయం.. ఇది శివాలయం

అది వైష్ణవాలయం.. ఇది శివాలయం

ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ధగధగలాడుతుందని, తెలంగాణకు నీరు వచ్చే శ్రీరాం సాగర్ మాత్రం శివాలయంలో ఉంటుందని తాను గతంలో ఎప్పుడో చెప్పానని కేసీఆర్ అన్నారు. నాటి నాయకులు మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు.

1996లోనే చెప్పా

1996లోనే చెప్పా

సమైక్య ఏపీగా ఉన్నంత కాలం మనకు ఏమీ లాభం ఉండదని తాను గతంలోనే చెప్పానని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో తిరుగుబాటు వస్తుందని, తాను బతికి ఉంటే ఉద్యమిస్తానని ఇదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్ట మీద 1996లో చెప్పానన్నారు. అనేక పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.

అదిలాబాద్ కాశ్మీర్‌లా ఉండేది

అదిలాబాద్ కాశ్మీర్‌లా ఉండేది

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు అదిలాబాద్ కాశ్మీర్‌లా ఉండేదన్నారు. నీళ్లు, వాగులతో కళకళలాడేదన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The TRS government has decided to revive the Sriram Sagar Project (SRSP), considered the lifeline of Telangana, by diverting water from Kaleswaram Lift Irrigation project. Chief minister K Chandrasekhar Rao launched the work on August 10.
Please Wait while comments are loading...