ఇక కేరాఫ్ ఢిల్లీ, గేమ్ ఛేంజ్ - కేసీఆర్ కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్ల అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై నిర్ణయం తీసుకోనున్నారు. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ బాట పట్టారు. కాళేశ్వరం రిపోర్టు.. ఫోన్ ట్యాపింగ్ వివాదాలు బీఆర్ఎస్ నేతలను చుట్టుముడుతున్నాయి. ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ పైన కీలక మంత్రాంగం నిర్వహిస్తున్నారు. తమ హయాంలో ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఇదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై వారు కూలంకుషంగా చర్చించారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్సీల వ్యవహారంపై సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాలని వారంతా నిర్ణయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో మూడు నెలల్లోగా చర్య లు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. దీంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలోనూ న్యాయ పోరాటానికి దిగాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

kcr-made-key-directions-for-party-leaders-over-kaleswaram-report-details-here

అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలకు అధినేత కేసీఆర్ స్పష్టమైన మార్గనిర్దేశం చేసారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి పోయాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. బీసీ సభ నిర్వహించాలని భావించిన పార్టీ వాయిదా వేసింది. దీంతో, తాజా రాజకీయాలతో పాటుగా ఢిల్లీ కేంద్రంగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+