వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులను,ఎమ్మెల్యేలను బానిసలుగా మార్చుకున్న కేసీఆర్.!ధనిక రాష్ట్రాన్ని సీఎం దివాళా తీయించారన్న ఈటల.!

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి/హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం కమలాపుర్ హాస్టల్ లో విషాహారం తిని పిల్లలు అస్వస్థతకు గురవ్వడం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిరదర్శనమని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో ఇది నిత్యకృత్యం అయ్యిందని,అధికారులు పని చేయడం లేదు అనడానికి ఇదే సాక్షమన్నారు. సకాలంలో బిల్లులు రాక, కాంట్రక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో కల్తీ సరుకులు తీసుకువచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నారన్నారు. 10/10 మార్కులు వచ్చిన టాప్ రాంక్ విద్యార్థులకు మాత్రమే బాసర ఐఐఐటీలో సీటు దొరికుతుందని,అలాంటి పిల్లలకు కనీస వసతులు కలిపించకపోవడం,భోజనం సరిగా పెట్టకపోవడం, కంప్యూటర్స్, లాప్టాప్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు ఈటల రాజేందర్.

 సౌకర్యాల కోసం విద్యార్థుల ధర్నాలు.. కేసీఆర్ పట్టించుకోలేదన్న ఈటల

సౌకర్యాల కోసం విద్యార్థుల ధర్నాలు.. కేసీఆర్ పట్టించుకోలేదన్న ఈటల


సౌకర్యాల కోసం విద్యార్థులు రోజుల తరబడి ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఈటల. అంత పెద్ద ఆందోళన జరిగిన తరువాత కూడా మళ్లీ ఫుడ్ పాయిజన్ అయ్యిందంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు ఈటల. మెదక్ ఐఐఐటీ లో వసతులు లేవు అని సమ్మె చేస్తున్నారని, మధ్యాహ్న భోజనం వండే వంట వాల్లకి డబ్బులు ఇవ్వకపోవడంతో పుచ్చిపోయిన కూరగాయలు, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని, ధనిక రాష్ట్రం అని, పేదల కోసమే తాను పుట్టానని చెప్పుకొనే చంద్రశేఖర్ రావు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.

 సీఎంగా కేసీఆర్ విఫలం.. ప్రజలు బీజేపిని గుర్తించాలన్న ఈటల రాజేందర్

సీఎంగా కేసీఆర్ విఫలం.. ప్రజలు బీజేపిని గుర్తించాలన్న ఈటల రాజేందర్


అంతే కాకుండా పర్ కాపిటా ఇన్కమ్ పెరిగిందని చెప్పే చంద్రశేఖర్ రావు వాస్తవ పరిస్థితిని గమనించాలన్నారు. కరోనా వల్ల ఆర్థిక స్థితి దిగ జారి, పిల్లల ఫీజుల కట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో వేస్తే వారికి సరిగా భోజన సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రుల గుండె కుంగి పోతుందన్నారు. చంద్రశేఖర్ రావు సీఎం గా న్యాయం చేసే పరిస్ధితులు లేవని, ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు ఈటల. చంద్రశేఖర్ రావు తన పక్కన ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను బానిసలు మార్చుకున్నారని, వాళ్లు సీఎంకు వాస్తవాలు చెప్పే ధైర్యం చేయడం లేదన్నారు. వరదల్లో కూడా ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని ఈటల మండిపడ్డారు.

 కేసీఆర్ కు మొహం చెల్లకనే కేంద్రానికి లేఖ రాయడం లేదు.. వరద సాయం పై మండిపడ్డ ఈటల

కేసీఆర్ కు మొహం చెల్లకనే కేంద్రానికి లేఖ రాయడం లేదు.. వరద సాయం పై మండిపడ్డ ఈటల

మంచిర్యాల పట్టణంలో మొదటి అంతస్తువరకు వరద నీళ్ళు వచ్చాయని, 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని, మరి ఇప్పుడు ఎందుకు మునిగాయని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఈటల. లోపం ఎక్కడ ఉందో ప్రభుత్వం ప్రజలకు వివరించాలన్నారు ఈటల. మునిగిన అన్నీ ప్రాంతాలను కాపాడాల్సిన సీఎం, కేవలం భద్రాచలంకు మాత్రమే నష్ట పరిహారం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మిగతా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు ఈ అంశంలో సీఎంను నిలదీయాలన్నారు. రాష్ట్రంలో నష్టం జరిగింది సాయం చేయండి అని కేంద్రంను కోరే సంస్కారం కూడా చంద్రశేఖర్ రావుకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర బీజేపీ కేంద్రాన్ని కోరడంతో, కేంద్రం బృందాలను పంపిస్తుందని ఈటల స్పష్టం చేసారు.

 శాస్త్రీయత లేని కాళేశ్వరం.. అన్నీ తప్పులేనన్న బీజేపి ఎమ్మెల్యే

శాస్త్రీయత లేని కాళేశ్వరం.. అన్నీ తప్పులేనన్న బీజేపి ఎమ్మెల్యే


వరదల వల్ల వందల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వ్యాధులకు అనుగుణంగా మందులను సిద్దం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేసారు.కేంద్రం ఇచ్చే ఫసల్ భీమా రాకుండా చేశారని, అదే ఉంటే రైతులందరికీ మేలు జరిగేదన్నారు ఈటల. ఒక పంటకి ఎంత దిగుబడి వస్తోందో లెక్కగట్టి అంత డబ్బు రైతుకు ఇవ్వాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో మంచి పంటలు పండే భూములు, నాణ్యత లేని కాలువలు కట్టడం వల్ల పాడవుతున్నాయన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు నీరో చక్రవర్తి లా వ్యవహరించవద్దని, ఇప్పటికైనా సవ్యంగా పరిపాలన చెయ్యాలని, లేదంటే చేత కాదని చెప్పి రాజీనామా చెయ్యాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేసారు.

English summary
CM Chandrasekhar Rao, who claims to be a rich state and was born for the sake of the poor, was furious that he was undermining all the systems Says bjp Huzurabad Mla Etala Rajendar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X