Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక పక్క ధర్నాచౌక్ లో కేసీఆర్ మహాధర్నా.!మరోపక్క రేవంత్ కర్షకుడా కదలిరా.!దద్దరిల్లుతున్ననగరం.!

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం ధర్మాలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తుతోంది. ఇందిరా పార్క్ లో మహాధర్నా పేరుతో అధికార గులాబీ పార్టీ దీక్షా కార్యక్రమానికి ఉపక్రమించగా, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ళు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి బషీర్ బాగ్ లోని వ్యవసాయ కమిషనరేట్ వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించాలని వ్యూహం రచించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీపిసిసి పిలుపునిచ్చింది.

 నగరంలో మూడు ప్రధాన పార్టీల నిరసనలు..

నగరంలో మూడు ప్రధాన పార్టీల నిరసనలు..

ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కమీషన్ కు కాంగ్రెస్ బృందం వినతి పత్రం ఇవ్వనుంది. కాంగ్రెస్. బీజేపీ, టిఆర్ఎస్ లు దొంగ నాటకాలు ఆడుతూ రైతులను మభ్యపెడుతు మోసం చేస్తున్న అంశాలను ఎండగడుతూ కాంగ్రెస్ కర్షకులారా కదలిరండ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఈ ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పబ్లిక్ గార్డెన్ కు చేరుకుని నిరసన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు టీపిసిసి నేతలు స్పష్టం చేసారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నిరసన కార్యక్రమాలు..

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నిరసన కార్యక్రమాలు..

అటు కాంగ్రెస్, ఇటు గులాబీ పార్టీ మాత్రమే కాకుండా బీజేపి యువమోర్చా కూడా నిరసన ర్యాలీకి సన్నామాలు చేసింది. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా మద్యం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపి నేతలు ర్యాలీ కార్యక్రమం నిర్విహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం వరకూ తెలంగాణ ప్రభుత్వంవై నిరసన ర్యాలీ చేపట్టబోతున్నట్టు బీజేవైఎం నేతలు స్పష్టం చేసారు. దీంతో నగరం మొత్తం ఈ రోజు ధర్నాలు, నిరసన ర్యాలీలు, దీక్షా కార్యక్రమాలతో హోరెత్తనున్నట్టు తెలుస్తోంది.
 మద్యం నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ నిరసన..

మద్యం నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ నిరసన..

ఇక మూడు పార్టీల నిరసన కార్యక్రమాలతో నగరం దద్దరిల్లుతున్నట్టు సమాచారం. ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ జెండాలతో నిండిపోగా, అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండాలతో నిండిపోయినట్టు తెలుస్తోంది. ఇక నాంపల్లి పరిసర ప్రాంతమంతా కమలం పార్టీ జెండాలతో నిండిపోయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రధానమైన మూడు పార్టీలు దీక్షలు, నిరసన కర్యక్రమాలకు సన్నాహాలు చేస్తుండడంతో వివిధ పార్టీకు చెందిన ముఖ్య నాయకులు రోడ్ల పై తళుక్కుమంటున్న దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రధాన పార్టీలన్నీ రోడ్ల మీదే..

ప్రధాన పార్టీలన్నీ రోడ్ల మీదే..

హైదరాబాద్ నగరంలో రెండు మూడు కీలోమీటర్ల పరిధిలో మూడు ప్రధాన పార్టీలు నిరసన కార్యక్రమాలు చేస్తుండడం అరుదైన సందర్బంగా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో నెలకొన్న ఉత్కంఠ పరిణామాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయా అనే సందేహం కలిగేంత స్థాయిలో రాజకీయ నేతలు రోడ్లపై కనిపిస్తుండడం సామాన్య ప్రజానీకాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి హైదరాబాద్ నగరం నడి బొడ్డులో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చోటుచేసుకోవడం, అందుకు అన్ని ప్రధాన పార్టీలు నిరసన ర్యాలీలు చేపట్టడంతో మహానగరంలో రాజకీయం సందడి కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+