గుడ్‌ మార్నింగ్‌ డాడీ.. అంటూ కవిత - కేసీఆర్ ఊహించని స్పందనతో..!!

బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారుతోంది. కవిత రాసిన లేఖ.. తదనంతర పరిణామా ల తో బీఆర్ఎస్ లో కలకలం మదలైంది. పరోక్షంగా తన అన్నకేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత.. తన తండ్రి కేసీఆర్ పైన గౌరవం చాటుకుంటున్నారు. వేరే పార్టీలో చేరేది లేదని తేల్చిన కవిత.. తాజాగా కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు వేళ పాం హౌస్ లో కలిసారు. కేసీఆర్ కు నోటీసు లు ఇవ్వటానికి నిరసనగా కవిత ధర్నా చేసారు. ఇక.. వివాదం కొనసాగుతున్న వేళ తనను కలిసేందు కు వచ్చిన కవితో కేసీఆర్ స్పందించిన తీరు పార్టీలో చర్చగా మారింది.

కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు ముందు కవిత ఫాం హౌస్ కు వెళ్లారు. అక్కడ తన తండ్రిని పలకరించారు. కేసీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, కేసీఆర్ అందుకు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. కేసీఆర్ వద్దకు చేరుకున్న కవిత గుడ్‌ మార్నింగ్‌ డాడీ అని పలకరించగా.. అందుకు ప్రతిస్పందనగా ఆగమంటూ ఆయన సైగ చేశారని పార్టీలోని కొందరు నేతల ద్వారా తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న హడావుడి కారణంగానే కేసీఆర్ తన కుమార్తెకు సమయం ఇవ్వలేదనేది వారి అభిప్రాయం. భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ కు కవిత చేరుకున్నారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కేసీఆర్‌ కిందకు వచ్చే వరకు అనిల్‌, కవిత.. కేసీఆర్‌ వెంటే ఉన్నట్లు సమాచారం.

kcr-mark-rection-while-kavith-meets-him-in-farm-house

కేసీఆర్‌ కాన్వాయ్‌ హైదరాబాద్‌కు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమె తన వాహనంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా కేసీఆర్ ను కలిసేందు కు కవిత వెళ్లారు. అయితే, కేసీఆర్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదనే చర్చ జరుగుతోంది. అయితే, కవిత వివాదం మొదలైన సమయం నుంచి కేసీఆర్ పార్టీ నేతలెవరూ ఈ విషయం పైన స్పందిచవద్దని సూచించినట్లు తెలుస్తోంది. కవిత సైతం తొలుత ఘాటుగా వ్యాఖ్య లు చేసినా.. ఆ తరువాత నెమ్మదించారు. ఇక, కవిత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది పార్టీలో చర్చ గా మారుతోంది. కేసీఆర్ మాత్రం మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉన్నట్లు స్పష్టం అవు తోంది. ఇక, కవిత ఏ పార్టీలో చేరటం.. కొత్త పార్టీ దిశగా అడుగులు వేయటం లేదనేది క్లారిటీ వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కవిత - కేసీఆర్ నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+